Page Loader
Serbia: సెర్బియాలో ఉద్యమ ప్రభావం.. ప్రధానమంత్రి రాజీనామా
సెర్బియాలో ఉద్యమ ప్రభావం.. ప్రధానమంత్రి రాజీనామా

Serbia: సెర్బియాలో ఉద్యమ ప్రభావం.. ప్రధానమంత్రి రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

సెర్బియాలోని నోవీసాడ్‌ నగరంలో గత నవంబరులో రైల్వేస్టేషన్‌ ముఖద్వార పైకప్పు కూలిన ఘటనలో 15 మంది మరణించినప్పటి నుంచి, విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం ఉద్ధృతమైంది. ఈ ఉద్యమం తీవ్రత కావడంతో ప్రధానమంత్రి మిలోస్‌ వుచెవిచ్‌ మంగళవారం తన రాజీనామా చేశారు. అయితే దేశాధ్యక్షుడు అలెగ్జాండర్‌ ఉచిచ్‌ నిరంకుశ పాలనపై ప్రజల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ప్రధాని వుచెవిచ్‌ రాజీనామా చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంపై బెల్‌గ్రేడ్‌ విశ్వవిద్యాలయ ఆచార్యుడు బ్రానిమిర్‌ జొవానోవిచ్‌ వ్యాఖ్యనించారు. ప్రధాని రాజీనామాతో సమస్యను పరిష్కరించగలరనుకుంటే, అది పెద్ద పొరపాటే అని పేర్కొన్నారు. సెర్బియాలో నియంతృత్వం సమాప్తమవడానికి సంపూర్ణ రాజకీయ మార్పులు అవసరమని ఆయన ఉద్ఘాటించారు.

Details

అవినీతి వల్లే రైల్వే స్టేషన్ ముఖద్వారం కూలింది

విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమానికి మేధావులు, న్యాయమూర్తులు, రైతులు, న్యాయవాదులు, నటులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ ఉద్యమానికి మద్దతుగా, విశ్వవిద్యాలయ విద్యార్థులు సోమవారం బెల్‌గ్రేడ్‌ వీధుల్లో 24 గంటలపాటు రవాణాను స్తంభింపజేశారు. ఈ నిరసనకు అన్ని రంగాలవారూ పాల్గొన్నారు. ప్రభుత్వ అవినీతి వల్లే రైల్వేస్టేషన్‌ ముఖద్వార పైకప్పు కూలిపోయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రధాని వుచెవిచ్‌ రాజీనామాను సెర్బియా పార్లమెంటు 30 రోజుల్లో ఆమోదించి కొత్త ప్రభుత్వం ఏర్పరచాలని లేదా మధ్యంతర ఎన్నికలు జరపాలని నిర్ణయించాలి. ఈ విషయంపై అధ్యక్షుడు ఉచిచ్‌ మంత్రివర్గంతో చర్చలు జరుపుతున్నారు.