
Indian origin CEO: అమెరికాలో వ్యభిచార గృహాలతో సంబంధాల ఆరోపణలు.. భారత సంతతి సీఈఓ అరెస్టు..ఎవరి అనురాగ్ బాజ్‌పేయి ?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయన్నఆరోపణలతో భారత సంతతికి చెందిన సీఈఓ అరెస్టయ్యారు.
క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రేడియంట్ కి సీఈఓగా ఉన్న అనురాగ్ బాజ్‌పాయ్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై న్యూయార్క్ పోస్ట్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
బోస్టన్ ప్రాంతంలోని కోర్టుకు సమర్పించిన నివేదికల ప్రకారం, అనురాగ్ బాజ్‌పాయ్ పేరు, వ్యభిచార గృహాలను తరచుగా సందర్శించిన, అధిక మొత్తం చెల్లించిన ఖాతాదారుల జాబితాలో ఉంది.
విచారణలో భాగంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, అనురాగ్ పేరు వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు,కాంట్రాక్టర్ల వంటి ప్రభావంతమైన వ్యక్తులతో కూడిన ప్రత్యేక క్లయింట్ల జాబితాలో ఉంది.
ఈ కస్టమర్లు గంటకు సగటున 600 డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
అనురాగ్‌కు సంస్థ మద్దతు
ఈ క్లయింట్లు ఎక్కువగా ఆసియా మహిళలను ఎంపిక చేసేవారని, అయితే ఈ మహిళలు మానవ అక్రమ రవాణా వల్ల ఈ పరిస్థితిలోకి నెట్టబడ్డారని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ కేసులో కంపెనీ సీఈఓ పేరు బయటకు రావడంతో గ్రేడియంట్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వారు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే సంస్థ మాత్రం పూర్తి స్థాయిలో అనురాగ్‌కు మద్దతు ప్రకటించింది.
అలాగే, న్యాయవ్యవస్థపై తమ నమ్మకాన్ని కూడా వ్యక్తం చేసింది.