
House of Horror: కరోనా భయంతో నాలుగేళ్లు గదిలోనే ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా పేరు వినగానే ఇప్పటికీ కొందరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఈ మహమ్మారి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
అప్పట్లో మందు లేకపోవడంతో లాక్‌డౌన్‌ల ద్వారా స్వీయ నియంత్రణే చికిత్సగా మారింది. బయటకు ఒక్క అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది.
తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో లాక్‌డౌన్‌లు క్రమంగా ఎత్తివేశారు. అయితే కొంతమంది కరోనా భయాన్ని ఇంకా మరిచిపోలేకపోయారు.
అందుకే బయట సమాజం సాధారణ స్థితికి చేరినా, వారు ఇంట్లోనే తామిని తామే బంధించుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఇలాంటి ఒక్క దుర్ఘటన స్పెయిన్‌లో ఇటీవల వెలుగుచూసింది. కరోనా భయంతో తల్లిదండ్రులు తమ ముగ్గురు పిల్లలను నాలుగేళ్లుగా ఒక గదిలో బంధించి ఉంచారు.
Details
తల్లిదండ్రులపై మానసిక వేధింపుల అభియోగాల కేసు
స్పానిష్ పోలీసుల జోక్యంతో ఆ పిల్లలకు చివరకు విముక్తి లభించింది.
స్పెయిన్‌లో నివాసముంటున్న జర్మన్ దంపతులకు 10 ఏళ్ల ఓ బాలుడు, 8 ఏళ్ల కవలలు ఉన్నారు. డిసెంబర్ 2021 నుంచి ఈ ముగ్గురు పిల్లలు బయటకు రావడంలేదని అధికారులు తెలిపారు.
ఈ పరిస్థితులు బయటపడిన తర్వాత, స్పానిష్ పోలీసులు ఆ ఇంటిని 'భయానక గృహం'గా అభివర్ణించారు.
తల్లిదండ్రులు పిల్లలపై ఫేస్‌మాస్క్‌లు ధరించమని బలవంతం పెట్టినట్లు సమాచారం.
దీంతో తల్లిదండ్రులపై మానసిక వేధింపుల అభియోగాలు నమోదు చేశారు.
ప్రస్తుతం పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించి, వైద్య సహాయం అందిస్తున్నారు. వారి మానసిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు కౌన్సిలింగ్ సేవలు కూడా అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.