తదుపరి వార్తా కథనం

South Korea: దక్షిణ కొరియాలో రైలు డ్రైవర్‌కి మంత్రి పగ్గాలు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jun 25, 2025
01:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలో తొలిసారిగా రైలు డ్రైవర్ ఒక మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉద్యోగ, శ్రమిక మంత్రిగా రైలు డ్రైవర్ కిమ్ యంగ్-హూన్ (57)ను అధ్యక్షుడు లీ జే-మ్యంగ్ ఎంపిక చేయడం విశేషం. రాజకీయ నాయకులు, కార్మిక సంఘాల ప్రభావానికి లోనయిన ఈ శాఖకు రైలు డ్రైవర్ మంత్రిగా రావడాన్ని కొంతమంది విమర్శకులు అనుమానంతో స్వాగతిస్తున్నారు. 1968లో జన్మించిన కిమ్ యంగ్-హూన్ బుసాన్ నివాసి. డోంగ్-ఆ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన, తర్వాత సంగ్‌కోంగ్‌హో యూనివర్శిటీలోని గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎన్జీఓ స్టడీస్‌లో రాజకీయ విధానంలో మాస్టర్స్ చేశారు.