
Donald Trump: ట్రంప్ కార్యవర్గంలోని కీలక పదవికి మరో భారతీయుడు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలో, వైద్య పరిశోధనల కోసం కీలకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)కు కొత్త డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్య (Jay Bhattacharya)ను నియమించారు.
ఈ విషయం ట్రంప్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.
"జై భట్టాచార్యను ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా నియమించడం నాకు గర్వకారణం.రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ సహకారంతో భట్టాచార్య గౌరవప్రదమైన బాధ్యతలను నిర్వర్తిస్తారు.నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు నాయకత్వం వహించడమే కాకుండా,అమెరికా ప్రజల జీవితాలను రక్షించే కీలక ఆవిష్కరణలకు దారితీసే ప్రయత్నాలు చేస్తారు.అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తారు," అని ట్రంప్ పేర్కొన్నారు.
వివరాలు
అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు కృషి చేస్తా: జై భట్టాచార్య
ఈ ప్రకటనపై జై భట్టాచార్య హర్షం వ్యక్తం చేశారు. "అధ్యక్షుడు ట్రంప్ నన్ను ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా నియమించడం గౌరవంగా భావిస్తున్నాను. మేము అమెరికన్ శాస్త్రీయ సంస్థలను పునరుద్ధరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యవంతం చేస్తాము," అని భట్టాచార్య తెలిపారు.