Donald Trump: ట్రంప్ షాకింగ్ ప్రకటన.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా 13 ఏళ్లు కుర్రాడు నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సంచలనంగా మారుతోంది.
వలసదారులపై కఠిన నిర్ణయాలు, పలు దేశాలకు నిధుల నిలిపివేత, విదేశీ దిగుమతులపై అధిక సుంకాలు విధించడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరపడం వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. తాజాగా మరో అద్భుత నిర్ణయం ప్రకటించారు.
అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా ఓ 13 ఏళ్ల బాలుడిని నియమిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రకటనతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
Details
క్యాన్సర్ తో పోరాడి జయించాడు
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశానికి హాజరైన ట్రంప్, తన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
13 ఏళ్ల డీజే డేనియల్‌ను యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
డీజే డేనియల్ అరుదైన క్యాన్సర్‌తో పోరాడి, దానిని జయించాడు. 2018లో క్యాన్సర్ బారినపడిన డేనియల్ గురించి ట్రంప్ మాట్లాడుతూ కేవలం ఐదు నెలలు మాత్రమే బతుకుతాడని వైద్యులు చెప్పారు. కానీ డేనియల్ ధైర్యంగా పోరాడాడు.
అతని కల పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. అదే కలతో బతికేందుకు సంకల్పించాడు. ఈరోజు అతను క్యాన్సర్‌ను జయించాడు. అతని ధైర్యానికి గుర్తుగా, తాము అతడికి ప్రత్యేక గౌరవం ఇస్తున్నామన్నారు.
Details
ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపిన కుర్రాడు
ఈ సందర్భంగా ట్రంప్, యూఎస్ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కరన్‌ను, డేనియల్‌ను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించాల్సిందిగా కోరారు.
ట్రంప్ మాటలు వినగానే రిపబ్లికన్ సభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొట్టి బాలుడిని అభినందించారు.
డెమోక్రటిక్ సభ్యులలో కూడా చాలా మంది ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. బాలుడి తండ్రి అతడిని ఎత్తుకుని సభకు చూపించగా, సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరన్, అధికారిక ఐడీ కార్డును అందజేశారు.
డేనియల్ ఆనందంతో మురిసిపోయాడు. తనను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించినందుకు ట్రంప్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.