LOADING...
USA: భారత్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ నుంచీ అమెరికా ఔట్‌..!
భారత్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ నుంచీ అమెరికా ఔట్‌..!

USA: భారత్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ నుంచీ అమెరికా ఔట్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయానికి తెరలేపారు. అమెరికా జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని భావిస్తున్న పలు అంతర్జాతీయ సంస్థలు,ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకుంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ ఇప్పటికే సంతకం చేసినట్లు వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం మేరకు మొత్తం 66 అంతర్జాతీయ సంస్థలకు అమెరికా తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. వీటిలో 31 ఐక్యరాజ్య సమితి (యూఎన్‌)కు చెందిన సంస్థలు, అలాగే 35 యూఎన్‌కు చెందని ఇతర అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. భారత్‌, ఫ్రాన్స్‌ కలిసి నేతృత్వం వహిస్తున్న ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ నుంచి కూడా అమెరికా బయటకు వస్తున్నట్లు ప్రకటించింది.

వివరాలు 

ఆ సంస్థలు నిర్వహించే సమావేశాల్లో అమెరికా పాల్గొదు 

అంతేకాకుండా మరికొన్ని కీలకమైన అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా వైదొలగనున్నట్లు తెలిపింది. యూఎన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ లా కమిషన్‌, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెంటర్‌, ఐరాస పాపులేషన్‌ ఏజెన్సీతో పాటు ఇతర సంస్థల నుంచి కూడా అమెరికా తప్పుకోనున్నట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, ఇకపై ఆ సంస్థలు నిర్వహించే సమావేశాల్లో అమెరికా పాల్గొనదు. అలాగే వాటికి ఎలాంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందించదని స్పష్టం చేసింది.

వివరాలు 

అన్ని సంస్థల నుంచి అమెరికా వీలైనంత త్వరగా బయటకు వచ్చేలా తక్షణ చర్యలు

వైట్‌హౌస్‌ విడుదల చేసిన మెమోరాండం ప్రకారం, పేర్కొన్న అన్ని సంస్థల నుంచి అమెరికా వీలైనంత త్వరగా బయటకు వచ్చేలా తక్షణ చర్యలు చేపట్టాలని ట్రంప్‌ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపింది. విదేశాంగ శాఖ నివేదికలు,తన కార్యనిర్వాహక బృందంతో జరిపిన విస్తృత చర్చల అనంతరమే ట్రంప్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement