UK To Rejoin EU: బ్రెగ్జిట్ తర్వాత కీలక మలుపు.. ఈయూలోకి తిరిగి చేరే ఆలోచనలో బ్రిటన్
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెగ్జిట్ తర్వాత యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ సంబంధాలపై మరోసారి కీలక చర్చ మొదలైంది. ఈయూలో బ్రిటన్ తిరిగి చేరే అవకాశాన్ని కూడా పరిశీలించాల్సి రావచ్చని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ సంకేతాలిచ్చారు. భవిష్యత్తులో యూరప్‌తో బ్రిటన్ సంబంధాలను ఎలా కొనసాగించాలనే అంశంపై అన్ని అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే ఫ్రాన్స్, స్పెయిన్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. బుధవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బర్న్‌హామ్ మాట్లాడుతూ.. బ్రిటన్ ప్రస్తుతం ఉన్న స్థితిలోనే కొనసాగడం, ఈయూతో కస్టమ్స్ యూనియన్‌లో చేరడం, సింగిల్ మార్కెట్‌లోకి తిరిగి వెళ్లడం వంటి మార్గాలను పరిశీలించవచ్చని చెప్పారు.
వివరాలు
సానుకూలంగా స్పందించిన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్
అవసరమైతే ఈయూలో పూర్తిస్థాయిలో తిరిగి చేరే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
అయితే ఏ మార్గం ఆచరణ సాధ్యమో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు ఏమిటో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
బర్న్‌హామ్ వ్యాఖ్యలపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సానుకూలంగా స్పందించారు.
బ్రిటన్ మళ్లీ ఈయూలో చేరేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని చెప్పారు.
బ్రిటన్ తిరిగి రావాలనుకుని, ప్రధాని బర్న్‌హామ్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తే.. అది బ్రిటన్‌తో పాటు యూరప్‌కు కూడా శుభవార్త అవుతుందని పేర్కొన్నారు.
అనంతరం 'వెల్‌కమ్ బ్యాక్' అంటూ తన స్పందనను వ్యక్తం చేశారు.
వివరాలు
స్పెయిన్ కూడా ఆ ప్రయత్నాన్ని స్వాగతిస్తుంది: శాంచెజ్
మెక్రాన్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయనతో పాటు స్పెయిన్ ప్రధాని పెద్రో శాంచెజ్ కూడా ఉన్నారు.
బ్రిటన్ ఈయూలో తిరిగి చేరాలని నిర్ణయించుకుంటే స్పెయిన్ కూడా ఆ ప్రయత్నాన్ని స్వాగతిస్తుందని శాంచెజ్ తెలిపారు.
దీంతో బ్రెగ్జిట్ తర్వాత ఈయూతో బ్రిటన్ భవిష్యత్ సంబంధాలపై చర్చ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈయూలో తిరిగి చేరే తుది నిర్ణయం తీసుకోలేదు.