LOADING...
Ukraine: రష్యా ఆర్థిక జీవనాడి కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్‌ డ్రోన్ దాడి
రష్యా ఆర్థిక జీవనాడి కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్‌ డ్రోన్ దాడి

Ukraine: రష్యా ఆర్థిక జీవనాడి కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్‌ డ్రోన్ దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపడానికి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజుకోరోజుకు మరింత పెరుగుతున్నాయి. తాజాగా, కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్ల దాడులు జరిగాయని ప్రకటించింది. రష్యాకు చమురు నుంచి వస్తున్న ఆదాయంతో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నందున.. దానిని దెబ్బతీసే యత్నాలలో భాగంగా ఈ దాడులు చేసినట్లు పేర్కొంది. "మేము చమురు కేంద్రంలోని రిజర్వాయర్లను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లను ప్రయోగించాము" అని ఉక్రెయిన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అలాగే, రష్యా చమురు క్షేత్రాలపై మరిన్ని దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. మూడేళ్లుగా యుద్ధంలో పాల్గొంటున్న ఉక్రెయిన్, తమ సైన్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఐరోపా దేశాల నుంచి సహాయం అందుకుంటోంది.Embed

వివరాలు 

మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం 

ఈ దేశాలు ఇప్పటికే తేలికపాటి యుద్ధ ట్యాంకులు,గగనతల రక్షణ వ్యవస్థలు, ట్యాంకు ధ్వంసక క్షిపణులు,ఇతర ఆయుధాలను అందిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కీవ్‌పై రష్యా దాడులు ఆగకపోవడం వల్ల, ఇంకా ఎక్కువ మద్దతు అందించాలని ఆయన ఐరోపా దేశాలను కోరారు. అంతేకాక,ఉక్రెయిన్ ఆర్థికాభివృద్ధి అంశాలపై త్వరలో అమెరికాతో చర్చలు జరపనున్నారు. ఇదే సమయంలో,రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్నయుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత నెల రోజుల్లో ఈ యుద్ధంలో సుమారు 25,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. యుద్ధం ఆపడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేనందుకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగితే,మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశముందని ఆయన హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్‌ డ్రోన్ దాడి

Advertisement