Zelenskyy: శాంతి ఒప్పందం 10 శాతం దూరంగా .. రష్యాతో శాంతి ఒప్పందంపై జెలెన్‌స్కీ్ కీలక ప్రకటన..
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, రష్యాతో శాంతి ఒప్పందానికి దాదాపు 10 శాతం దూరం మాత్రమే ఉందని ప్రకటించారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఇచ్చిన ప్రసంగంలో జెలెన్‌స్కీ దేశ యుద్ధానికి తుది ముగింపు రావాలని ఆశ వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కోసం బలమైన భద్రతా హామీలు తప్పనిసరి, దాన్ని కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం కోరడం కాదని ఆయన పేర్కొన్నారు. రష్యా మళ్లీ దాడి చేయకుండా నిరోధించే ఏ విధమైన ఒప్పందానికైనా ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మిగిలిన 10 శాతంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. మాస్కోకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదని హెచ్చరించారు.
వివరాలు
నాలుగేళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం
ఉక్రెయిన్‌లో రష్యా సుమారు 20 శాతం భూభాగాన్ని ఆక్రమించినట్టు వివరించారు. అలాగే, ఒప్పందంలో తూర్పు డాన్‌బాస్ ప్రాంతాన్ని మాస్కో భాగంగా చేర్చాలని ఒత్తిడి చేస్తోందని, అయితే ఆ భూభాగాన్ని వదులుకోవాల్సిందిగా డిప్లొమాట్లు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అయితే, ఆ భూమిని వదులుకోవడానికి ఏ పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం మొత్తం 90 శాతం శాంతి ఒప్పందం సిద్ధమై ఉందని, మిగిలిన 10 శాతం ఉక్రెయిన్, యూరోప్ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడవ్వగానే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి శతవిధాల ప్రయత్నాలు మొదలయ్యాయి.
వివరాలు
అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు చర్చలు
ఇరు దేశాధినేతలతో సమావేశం అయ్యారు. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు.తాజాగా, 28 పాయింట్ల ప్రణాళికను ముందుకు తెచ్చారు. దీనిపై రష్యా అంగీకారం తెలిపితే, ఉక్రెయిన్ తిరస్కరించింది. ప్రస్తుతం అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు చర్చలు కొనసాగిస్తున్నారు. త్వరలోనే శాంతి ఒప్పందం సాధ్యమని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. నూతన సంవత్సరంలో మేము నిజమైన శుభవార్తను వింటామో కాదో, సమయం మాత్రమే చెబుతుంది.