LOADING...
Trump: తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్
తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్

Trump: తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం నుంచి శుక్రవారం వరకు చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపడుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ట్రంప్‌ అమెరికా అధ్యక్షుని హోదాలో మళ్లీ చైనాకు వెళ్లనున్నారు. అంతకుముందు ఆయన 2017లో అధ్యక్షుడిగా చైనాను సందర్శించారు. ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు నెలకొనడం,హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనంపై అంతర్జాతీయ ఆందోళనలు పెరగడం,ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ట్రంప్‌ చైనా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. బుధవారం సాయంత్రానికి ట్రంప్‌ బీజింగ్‌కు చేరుకోనున్నారు.గురువారం,శుక్రవారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజింగ్‌లో ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీకి ఏర్పాట్లు

Advertisement