LOADING...
Donald Trump: అమెరికాలో ఏడాదిలోనే రికార్డు స్థాయిలో వీసాల రద్దు.. లక్ష మందికి పైగా బహిష్కరణ!
లక్ష మందికి పైగా బహిష్కరణ!

Donald Trump: అమెరికాలో ఏడాదిలోనే రికార్డు స్థాయిలో వీసాల రద్దు.. లక్ష మందికి పైగా బహిష్కరణ!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ప్రభుత్వం 2025 సంవత్సరంలో విపరీతంగా విదేశీ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఒక్క సంవత్సరంలో లక్షకు పైగా వీసాలను రద్దు చేయడం రికార్డు స్థాయికి చేరిందని, 2024 తో పోలిస్తే ఇది 150 శాతం ఎక్కువమని అమెరికా విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. ఈ నిర్ణయం, ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వలస విధానాల భాగంగా, దేశ భద్రతను పెంపొందించడానికి తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. "అమెరికా పౌరుల భద్రత,దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడం ట్రంప్ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. జాతీయ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే విదేశీయులపై కఠిన చర్యలు తీసుకుంటాం"అని విదేశాంగ శాఖ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు.

వివరాలు 

డ్రంకెన్ డ్రైవ్, దొంగతనాలు, డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న వారిపై వేటు 

రద్దు చేసిన వీసాలలో సుమారు 8,000 విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వీసాలు ఉన్నట్లు తెలిపారు. వీసా రద్దుకు ప్రధాన కారణాలు గడువు ముగిసిన తరువాత దేశంలోనే ఉండిపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం (DUI), దాడులు, దొంగతనాలు వంటి నేరాలలో పాలుపంచుకోవడం అని అధికారులు చెప్పారు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వీసాల్లో కూడా 50 శాతం డ్రంకన్ డ్రైవింగ్ కేసులు,30శాతం దాడి కేసులు ఉన్నట్లు వెల్లడించింది. విదేశాంగ శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా, "ఇలాంటి నేరస్థులను దేశం నుండి పంపించివేస్తూ అమెరికాను సురక్షితంగా ఉంచుతాం" అని పేర్కొంది.

వివరాలు 

'కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్' అనే కొత్త విభాగం ఏర్పాటు

అమెరికాలో ఉండే విదేశీయులు స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండేలా చూడడానికి 'కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్' అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారని ప్రభుత్వం వెల్లడించింది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులను కూడా నిశితంగా పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. మొత్తం మీద, ట్రంప్ ప్రభుత్వం వలసదారుల విషయంలో అత్యంత కఠినమైన విధానాన్ని అవలంబిస్తూ, భవిష్యత్తులో ఈ కఠినత కొనసాగుతుందని అధికారాలు సంకేతం ఇచ్చారు.

Advertisement