US: లాస్‌ఏంజిల్స్‌లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. దూసుకొచ్చిన వ్యతిరేక ట్రక్కు.. పలువురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోయాయి. డిసెంబర్ 28న ప్రారంభమైన నిరసనలు తాజాగా మరింత తీవ్రతరం అయ్యాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నిరసనకారులు తీవ్ర ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు ప్రారంభించాయి. ఇప్పటివరకు 538 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్‌లోని నిరసనలు దేశ పరిమితికి మాత్రమే పరిమితం కాకుండా, విదేశాల్లో కూడా ప్రతిఫలిస్తున్నాయి. ముఖ్యంగా, అగ్ర రాజ్య అమెరికాలో, లాస్ ఏంజిల్స్‌లో, సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. రెజా ప్రహ్లవి మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
వివరాలు
దాడిలో అనేక మంది నిరసనకారులకు గాయాలు
ఈ నిరసనల సందర్భంలో, ముజాహిదీన్-ఎ-ఖల్క్ (ఎంఈకే) అనే ఖమేనీ వ్యతిరేక సంస్థ స్టికర్ అతికించిన ఒక ట్రక్కు నిరసనకారులపైకి దూసుకొచ్చింది. ట్రక్కుపై "నో షా" అనే నినాదం కూడా ఉండగా, దాడిలో అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే
WATCH: Protesters clash with police in Los Angeles after man drove truck into crowd https://t.co/21TtAZ6f1c pic.twitter.com/wuNdF9k2GA
— Rapid Report (@RapidReport2025) January 12, 2026