Ducati DesertX V2: 110hp పవర్.. 890సీసీ ఇంజిన్.. డుకాటీ కొత్త బైక్ వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్లోకి డుకాటీ కొత్త అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేసింది. DesertX V2 పేరుతో తీసుకొచ్చిన ఈ రెండో తరం మోటార్‌సైకిల్ ధరను రూ.19.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించింది. ఇందులో సరికొత్త 890సీసీ V2 ఇంజిన్, మోనోకాక్ ఛాసిస్, అప్‌డేటెడ్ KYB సస్పెన్షన్, అధునాతన ఎలక్ట్రానిక్స్ వంటి పలు అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. మ్యాట్ స్టార్ వైట్ సిల్క్ అనే ఒకే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా డుకాటీ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ మొదటి వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
వివరాలు
890సీసీ V2 ఇంజిన్‌తో కొత్త డెజర్ట్‌ఎక్స్ V2
DesertX V2లో డుకాటీ సరికొత్త 890సీసీ V2 ఇంజిన్‌ను అమర్చింది. ఇది 9,000rpm వద్ద 110hp పవర్, 7,000rpm వద్ద గరిష్ఠంగా 92Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కంపెనీ ఇప్పటివరకు తయారు చేసిన ట్విన్ సిలిండర్, ఫోర్ వాల్వ్స్ పర్ సిలిండర్ ఇంజిన్లలో ఇదే అత్యంత తేలికైనది.
మెరుగైన పనితీరు కోసం IVT వేరియబుల్ ఇన్‌టేక్ వాల్వ్ టైమింగ్ సిస్టమ్‌ను కూడా అందించింది.
వివరాలు
రివైజ్డ్ గేర్ రేషియోలతో 6-స్పీడ్ గేర్‌బాక్స్
ఈ బైక్‌లో ఆరు స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. ఇందులో గేర్ రేషియోలను సవరించారు.
ఆఫ్‌రోడ్ రైడింగ్‌కు అనుకూలంగా మొదటి నాలుగు గేర్లను తక్కువ రేషియోతో రూపొందించగా.. హైవే ప్రయాణాల కోసం ఆరో గేర్‌ను పొడవైన రేషియోతో ఇచ్చారు.
సర్వీసింగ్ విషయంలోనూ ఆకట్టుకునే అంశాలున్నాయి.
ప్రతి 45,000 కిలోమీటర్లకు ఒకసారి వాల్వ్ క్లియరెన్స్ తనిఖీ చేయాలి. ఇంజిన్ ఆయిల్‌ను ప్రతి 15,000 కిలోమీటర్లకు లేదా రెండేళ్లకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది.
వివరాలు
అల్యూమినియం మోనోకాక్ ఫ్రేమ్
DesertX V2లో ప్రత్యేకంగా రూపొందించిన అల్యూమినియం మోనోకాక్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు.
ఇందులో ఇంజిన్‌ను స్ట్రెస్డ్ మెంబర్‌గా వినియోగించడంతో పాటు అదే ఎయిర్‌బాక్స్‌గానూ పనిచేస్తుంది.
వెనుక భాగంలో ట్రెల్లిస్ సబ్‌ఫ్రేమ్, ప్రోగ్రెసివ్ రియర్ సస్పెన్షన్ లింకేజ్‌తో కూడిన కొత్త డబుల్ సైడెడ్ అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్‌ను అమర్చారు.
ఆఫ్‌రోడ్ రైడింగ్‌కు అనువుగా 21 ఇంచుల ఫ్రంట్, 18 ఇంచుల రియర్ ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌ను అందించారు. వీటికి పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ STR టైర్లను అమర్చారు.
వివరాలు
209 కిలోల బరువు.. 18 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్
ఈ బైక్ ఫ్యూయల్ మినహా వెట్ వెయిట్ 209 కిలోలుగా ఉంది. ఇందులో 18 లీటర్ల పాలిమర్ ఫ్యూయల్ ట్యాంక్‌ను అమర్చారు.
అదనపు రక్షణ కోసం ట్యాంక్‌పై టెక్స్చర్డ్ గ్రిప్ ప్యానెల్స్, క్రాష్ ప్యాడ్ ప్రొటెక్షన్ అందించారు.
బ్రేకింగ్ కోసం ముందు వైపు ట్విన్ 305mm డిస్క్‌లు, Brembo M4.32 రేడియల్ మోనోబ్లాక్ కాలిపర్లను ఇచ్చారు.
వివరాలు
కార్నరింగ్ ABS.. ఆరు రైడింగ్ మోడ్‌లు
Ducati DesertX V2లో ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి.
నాలుగు స్థాయిల కార్నరింగ్ ABSను అందించారు. ఎండ్యూరో, ర్యాలీ మోడ్‌లలో దీన్ని పూర్తిగా డీయాక్టివేట్ చేసుకోవచ్చు.
వివిధ రహదారులు, భూభాగాలకు అనుగుణంగా స్పోర్ట్, టూరింగ్, అర్బన్, వెట్, ఎండ్యూరో, ర్యాలీ.. ఇలా మొత్తం ఆరు రైడింగ్ మోడ్‌లను అందించారు.