Maruti Suzuki Fronx: 38 నెలల్లో 2 లక్షల ఎగుమతులు.. మారుతి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
మారుతీ సుజుకీ ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న ఫ్రాంక్స్ ఎస్‌యూవీ అరుదైన రికార్డు సృష్టించింది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎస్‌యూవీల్లో అత్యంత వేగంగా 2 లక్షల యూనిట్ల ఎగుమతి మైలురాయిని చేరిన మోడల్‌గా నిలిచింది. 2023 జూన్‌లో ఎగుమతులు ప్రారంభించిన ఫ్రాంక్స్.. కేవలం 38 నెలల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ఫ్రాంక్స్ దాదాపు 90 దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇందులో జపాన్ కూడా ఉంది. తొలి లక్ష యూనిట్ల ఎగుమతిని 25 నెలల్లో పూర్తి చేసిన ఈ ఎస్‌యూవీ.. రెండో లక్ష యూనిట్లను కేవలం 13 నెలల్లోనే అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఫ్రాంక్స్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతున్నదానికి ఇది నిదర్శనంగా మారింది.
వివరాలు
ఎగుమతుల్లో కీలకంగా..
గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఫ్రాంక్స్‌ను తయారు చేస్తున్నారు. కంపెనీ ఎగుమతుల్లో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న ప్యాసింజర్ వాహనంగా ఫ్రాంక్స్ నిలిచింది.
మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేయూచి మాట్లాడుతూ.. ఫ్రాంక్స్ ఎగుమతులు వేగంగా పెరగడం అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మోడల్‌కు ఆదరణ పెరుగుతోందనడానికి సంకేతమని తెలిపారు.
ఎగుమతులపై కంపెనీ కొనసాగిస్తున్న దృష్టి కారణంగానే భారత్ నుంచి ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో మారుతి సుజుకి అగ్రస్థానాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
వివరాలు
జపాన్‌కు తొలి మారుతి ఎస్‌యూవీ..
లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లోని దాదాపు 90 మార్కెట్లకు ప్రస్తుతం ఫ్రాంక్స్ ఎగుమతి అవుతోంది.
2024 ఆగస్టులో జపాన్‌కు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. జపాన్‌కు ఎగుమతి అయిన తొలి మారుతి సుజుకి ఎస్‌యూవీగా ఫ్రాంక్స్ ప్రత్యేకత సాధించింది.
మారుతి సుజుకి ప్రస్తుతం దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది.
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-3 ప్యాసింజర్ వాహనాలు కూడా తమ పోర్ట్‌ఫోలియోలోని మోడళ్లేనని కంపెనీ వెల్లడించింది.
వివరాలు
ఫ్రాంక్స్ ధర, ఇంజిన్ వివరాలు
భారత మార్కెట్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ.6.85 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.11.98 లక్షలు (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది.
దేశంలో ఈ ఎస్‌యూవీని నెక్సా అవుట్‌లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఫ్రాంక్స్‌లో 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
వీటికి మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.