LOADING...
TATA Tiago: కొత్త టియాగో వచ్చేసింది.. అదిరే ఫీచర్లతో టాటా సంచలనం
కొత్త టియాగో వచ్చేసింది.. అదిరే ఫీచర్లతో టాటా సంచలనం

TATA Tiago: కొత్త టియాగో వచ్చేసింది.. అదిరే ఫీచర్లతో టాటా సంచలనం

వ్రాసిన వారు Moogati Shabari
May 28, 2026
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్‌ తన కొత్త తరం టియాగో, టియాగో ఈవీ మోడళ్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌గా వచ్చిన కొత్త టియాగో ప్రారంభ ధర రూ.4.69 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించగా, టియాగో ఈవీ ధర రూ.6.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ప్రకటించింది. ఇక బ్యాటరీ అద్దె విధానంలో టియాగో ఈవీని కొనుగోలు చేసే వారికి రూ.4.69 లక్షలతో పాటు ప్రతి కిలోమీటరుకు రూ.2.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. టియాగో ఐసీఎన్‌జీ వేరియంట్‌ ధర రూ.5.79 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా కంపెనీ వెల్లడించింది.

వివరాలు

అద్భుతమైన ఫీచర్లు..

కొత్త టియాగోలో డిజైన్‌, ఇంటీరియర్‌, ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులు చేశారు. మారుతీ సుజుకీ స్విఫ్ట్‌, హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకువచ్చారు. ముందుభాగంలో ఐబ్రో స్టైల్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, డీఆర్‌ఎల్స్‌ను అమర్చారు. వెనుక భాగంలో ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్‌ను అందించారు. అలాగే 15 అంగుళాల డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టియాగో ఈవీ మోడల్‌లో కూడా దాదాపు ఇదే డిజైన్‌ను కొనసాగించారు. ఇంటీరియర్‌ విషయానికి వస్తే, కొత్త టియాగోలో 2-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌తో పాటు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను అందించారు.

వివరాలు

భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌..

అదనంగా డ్యూయల్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్‌, రియర్‌ ఏసీ వెంట్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌ వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అందించారు. ఇంజిన్‌ పరంగా చూస్తే, టియాగోలో 1.2 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్‌ 86 హెచ్‌పీ పవర్‌, 113 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

వివరాలు

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 205 కిలోమీటర్ల వరకు ప్రయాణం..

సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా 1.2 లీటర్‌ ఇంజిన్‌ను అందించగా, అది 74 హెచ్‌పీ పవర్‌, 96 ఎన్‌ఎం టార్క్‌ను ఇస్తుంది. ఈ రెండు మోడళ్లూ 5-స్పీడ్‌ మాన్యువల్‌, 5-స్పీడ్‌ ఏఎంటీ గేర్‌బాక్స్‌ ఎంపికల్లో లభించనున్నాయి. టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. 19.2 kWh బ్యాటరీతో కూడిన వేరియంట్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 205 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. అలాగే 24 kWh బ్యాటరీ వేరియంట్‌ సింగిల్‌ ఛార్జ్‌తో 215 కిలోమీటర్ల వరకు రేంజ్‌ ఇస్తుందని వెల్లడించింది. ఛార్జింగ్‌ కోసం 3.3kW పోర్టబుల్‌ ఛార్జర్‌, 7.2kW హోమ్‌ ఛార్జర్‌, 30kW డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయాలను అందిస్తున్నారు.

Advertisement