2026 Toyota Fortuner: కొత్త అవతారంలో ఫార్చ్యూనర్.. 2026 మోడల్ స్పై ఫోటోలు వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
2026 టయోటా ఫార్చ్యూనర్‌కి సంబంధించిన కొత్త స్పై ఫోటోలు బయటకు రావడంతో ఎస్యూవీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. థాయిలాండ్‌లో టెస్టింగ్ చేస్తుండగా కనిపించిన ఈ కొత్త జనరేషన్ మోడల్ పూర్తిగా కవరింగ్‌తో ఉన్నప్పటికీ, ఇది చిన్న మార్పులు కాదు... పూర్తి స్థాయి అప్‌డేట్‌కి టయోటా సిద్ధమవుతోందని స్పష్టమైంది. 2004లో ప్రపంచానికి పరిచయమైన ఫార్చ్యూనర్, భారత్‌లో 2009లో లాంచ్ అయ్యి రెండు దశాబ్దాలుగా ఎస్యూవీ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. బలమైన నిర్మాణం,నమ్మకమైన పనితీరు, రోడ్డు మీద గంభీరమైన లుక్‌తో ఫార్చ్యూనర్ ఎప్పుడూ టాప్‌లోనే నిలిచింది. ఇప్పుడు 2026 మోడల్‌లో మరింత అగ్రెసివ్ డిజైన్ రానుందనే అంచనాలు ఉన్నాయి.
వివరాలు
హైలక్స్ స్టైల్ లుక్… ఫీచర్లలో నెక్స్ట్ లెవెల్ ఫార్చ్యూనర్!
ఆన్‌లైన్‌లో వచ్చిన రెండర్ చిత్రాలు చూస్తే పెద్ద హెక్సాగనల్ గ్రిల్, హనీకోంబ్ ప్యాటర్న్, స్లిమ్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డీఆర్‌ఎల్స్‌తో పాటు మస్క్యులర్ బంపర్ డిజైన్ కనిపించే అవకాశం ఉంది. మొత్తం లుక్ మాత్రం హైలక్స్ స్టైల్‌ను గుర్తు చేసేలా ఉండొచ్చని చెబుతున్నారు. లోపల కూడా భారీ మార్పులు ఉండనున్నాయి. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్యానోరమిక్ సన్‌రూఫ్, ఓవర్ ద ఎయిర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.
వివరాలు
ADAS ఫీచర్లు, మైల్డ్ హైబ్రిడ్ ప్లాన్… ఫార్చ్యూనర్ మాసివ్ అప్‌డేట్!
అలాగే టయోటా సేఫ్టీ సెన్స్‌తో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ అవాయిడెన్స్ వంటి అడ్వాన్స్ ఫీచర్లు కూడా జోడించే అవకాశముంది. ఇంజిన్ విషయంలో ప్రస్తుతం ఉన్న 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ టర్బో డీజిల్ ఆప్షన్లను కొనసాగిస్తూ, తర్వాత దశలో 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి 2026 ఫార్చ్యూనర్ మరింత స్టైల్, టెక్నాలజీ, సేఫ్టీతో మార్కెట్‌లో సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది.