LOADING...
Triumph Bonneville T120: భారత్‌లో లాంచ్ అయిన 2026 ట్రయంఫ్ బోనేవిల్ T120.. ధర, ఫీచర్లు ఇవే!
భారత్‌లో లాంచ్ అయిన 2026 ట్రయంఫ్ బోనేవిల్ T120.. ధర, ఫీచర్లు ఇవే!

Triumph Bonneville T120: భారత్‌లో లాంచ్ అయిన 2026 ట్రయంఫ్ బోనేవిల్ T120.. ధర, ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటిష్ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లో కొత్త ట్రయంఫ్ బోన్నెవిల్లే T120 బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ నయా-రెట్రో మోటార్‌సైకిల్ ధరను రూ. 12.17 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే సుమారు రూ. 30,000 వరకు ధర పెరిగినప్పటికీ, ఇందులో పలు కొత్త ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీ అప్‌డేట్లు అందుబాటులోకి వచ్చాయి. 2026 బోన్నెవిల్లే టి120 తన క్లాసిక్ బ్రిటిష్ స్టైలింగ్‌ను కొనసాగిస్తూ మరింత ప్రీమియం ఫినిష్‌తో మార్కెట్లోకి వచ్చింది. రౌండ్ LED హెడ్‌ల్యాంప్, క్రోమ్ ఎలిమెంట్స్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, వైర్-స్పోక్ వీల్స్ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

వివరాలు

ఇంజిన్, పనితీరు

కొత్త హెడ్‌లైట్ డిజైన్‌తో పాటు కొన్ని కాస్మెటిక్ మార్పులు కూడా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ బైక్‌లో 1200cc లిక్విడ్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ బలమైన టార్క్, స్మూత్ పవర్ డెలివరీ అందిస్తూ దీర్ఘ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేసిన ఈ ఇంజిన్ క్లాసిక్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

వివరాలు

కొత్త ఫీచర్లు

2026 మోడల్‌లో IMU ఆధారిత రైడర్ ఎయిడ్స్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. దీంతో Cornering ABS Traction Control Cruise Control Ride Modes వంటి ఆధునిక ఫీచర్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని కంపెనీ వెల్లడించింది. ఇతర బోన్నెవిల్లే మోడళ్లూ విడుదల బోన్నెవిల్లే టి120తో పాటు ట్రయంఫ్ సంస్థ కొత్త ట్రయంఫ్ బోన్నెవిల్ బాబర్, ట్రయంఫ్ బోన్నెవిల్ స్పీడ్‌మాస్టర్ మోడళ్లను కూడా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ అన్ని మోడళ్లను కంపెనీ "అన్‌లీష్డ్ 2026" క్యాంపెయిన్‌లో భాగంగా పరిచయం చేసింది.

Advertisement