TVS Raider 125: కొత్త రంగులతో ఆకట్టుకుంటున్న టీవీఎస్ రైడర్ 125.. ధర, ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ తాజా మోడల్‌గా 2026 రైడర్ 125ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ వాహనానికి ప్రారంభ ధరగా రూ.82,860 (ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా నిర్ణయించారు. యువతను ఆకట్టుకునేలా క్రీడా శైలిలోని నేకడ్ స్ట్రీట్ నమూనాతో రూపొందించారు. ఇందులో ఎస్‌ఎక్స్‌సీ డీడీ,టీఎఫ్‌టీ డీడీ అనే రెండు కొత్త అత్యున్నత తరగతి రూపాలను ప్రవేశపెట్టారు. ఈ వాహనంలో కొత్తగా నైట్రో గ్రీన్ రంగును అందుబాటులోకి తీసుకువచ్చారు. హెడ్‌ల్యాంప్ కౌల్, ఫ్రంట్ ఫెండర్, ప్యూయెల్ ట్యాంకు, సైడ్‌పానెల్స్‌కు నైట్రో గ్రీన్ షేడింగ్ ఇచ్చారు. ముందు చక్రం కూడా ఆకుపచ్చ రంగులో ఉండగా,వెనుక చక్రం నలుపు రంగులో ఉంటుంది.
వివరాలు
99+ ఫీచర్లను కనెక్ట్ చేసేలా TFT డిస్‌ప్లే స్క్రీన్
అదనంగా మెటాలిక్ నీలం, ఎరుపు రంగుల ఎంపికలు కూడా ఉన్నాయి. యితే, నైట్రో గ్రీన్ టాప్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఇక సాంకేతిక సదుపాయాల విషయానికొస్తే, అంతేకాకుండా టాప్ వేరియంట్లలో బ్లూటూత్ ద్వారా కాల్స్ అలర్ట్స్ వంటి 99+ ఫీచర్లను కనెక్ట్ చేసేలా TFT డిస్‌ప్లే స్క్రీన్ తీసుకొచ్చారు. ఇంజిన్ విషయానికి వస్తే,గత మోడల్‌ల మాదిరిగానే 124.8 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 11.38 హెచ్‌పీ శక్తిని, 11.2 ఎన్‌ఎం మలుపు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఐదు దశల గేర్ వ్యవస్థ కలదు. కొత్తగా ఐజీఓ సాంకేతికతను చేర్చారు. ముందున్న వాహనాన్ని దాటే సమయంలో టార్క్ 11.75 ఎన్‌ఎంకు చేరుతుంది.
వివరాలు
ధరలు ఇలా.. (ఎక్స్‌షోరూమ్)
టీవీఎస్ డ్రమ్ వేరియంట్ ధర రూ.82,860 టీవీఎస్ సింగిల్ సీట్ ధర రూ.88,470 టీవీఎస్ స్ల్పిట్ సీట్ ధర రూ.92,520 టీవీఎస్ ఐజీఓ ధర రూ.92,520 టీవీఎస్ SSE ధర రూ.93,520 టీవీఎస్ SXC DD ధర రూ.96,725 టీవీఎస్ TFT DD ధర రూ.98,550