2027 BMW 7 Series: కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీతో 2027 బీఎండబ్ల్యూ 7 సిరీస్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ BMW తన ఫ్లాగ్‌షిప్ సెడాన్ 2027 7 సిరీస్‌ను కొత్త లుక్, అప్‌డేటెడ్ ఫీచర్లతో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర 1,01,350 డాలర్లుగా నిర్ణయించగా, ఇది పాత మోడల్ కంటే కేవలం 500 డాలర్లు మాత్రమే ఎక్కువ. న్యూ క్లాస్ డిజైన్ తత్వానికి అనుగుణంగా ఈ కారులో ఎక్స్‌టీరియర్, ఇన్‌టీరియర్‌లో కీలక మార్పులు చేశారు. బయట కొత్త కిడ్నీ గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌లైట్స్, రీడిజైన్ చేసిన టెయిల్‌లైట్స్ ఆకట్టుకుంటాయి. లోపల పానోరమిక్ ఐడ్రైవ్ స్క్రీన్‌ను విండ్షీల్డ్ అడుగుభాగంలో పిలర్ నుంచి పిలర్ వరకు అమర్చారు. అదనంగా, ప్యాసింజర్ కోసం ప్రత్యేక స్క్రీన్‌ను స్టాండర్డ్‌గా అందించారు.
వివరాలు
28 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు చార్జ్
ఇంజిన్ విషయానికి వస్తే, 740 రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లో 3.0 లీటర్ టర్బో ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 394 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.ఎలక్ట్రిక్ వేరియంట్ i7 50 xDrive లో డ్యూయల్ మోటార్ సెటప్‌తో 449 హార్స్ పవర్,660 న్యూటన్ మీటర్ల టార్క్ లభిస్తుంది. టాప్ స్పీడ్ 209 కిలోమీటర్లకు పెరిగింది. మరోవైపు i7 xDrive60 వేరియంట్ టాప్ స్పీడ్ 240 కిలోమీటర్ల వరకు చేరుతుంది. కొత్త బ్యాటరీ టెక్నాలజీతో 112 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగి ఉండగా,కేవలం 28 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. రేంజ్ కూడా 563కిలోమీటర్లకు పైగా పెరిగింది. ఈ మోడల్ ఉత్పత్తి జూలై నుంచి ప్రారంభం కానుంది.