Page Loader
MG Windsor EV: భారత మార్కెట్లోకి రూ.9.99 లక్షల ధరతో కొత్త ఎలక్ట్రిక్ కార్
భారత మార్కెట్లోకి రూ.9.99 లక్షల ధరతో కొత్త ఎలక్ట్రిక్ కార్

MG Windsor EV: భారత మార్కెట్లోకి రూ.9.99 లక్షల ధరతో కొత్త ఎలక్ట్రిక్ కార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2024
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎంజీ మోటార్స్ తన మూడవ విద్యుత్తు కారు "విండ్‌సోర్‌ ఈవీ" ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు. ఎంజీ ఇప్పటికే మార్కెట్లో జెడ్‌ఎస్‌ ఈవీ, కోమెట్‌ ఈవీ లను విక్రయిస్తోంది. ఇప్పుడు విండ్‌సోర్ తో విద్యుత్తు వాహనాల్లో మరింత పట్టు సాధించాలని భావిస్తోంది. విండ్‌సోర్ తో పాటు ఎంజీ "బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ (బీఏఏఎస్‌)" అనే కొత్త ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రామ్ కింద, కిలోమీటర్‌కు రూ.3.5 చొప్పున చెల్లించి వినియోగదారులు బ్యాటరీ అద్దెకు తీసుకోవచ్చు.

Details

అక్టోబర్ 12 నుంచి డెలవరీలు

అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం కాగా, డెలివరీలు అక్టోబర్ 12 నుండి మొదలవుతాయి. దీని వీల్‌బేస్‌ 2,700 మిమీ ఉండటంతో వెనుక సీట్లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. 18 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. విండ్‌సోర్ లో 38 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ తో 134 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేసే సింగల్ ఎలక్ట్రిక్ మోటర్ అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ కార్ లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ వంటి డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.