Mahindra XEV 9e : లగ్జరీ ఈవీలకు షాక్.. ఎక్స్ఈవీ 9ఈ సినీలక్స్ ఎడిషన్ వచ్చేసింది.. ధర ఎంతంటే!
ఈ వార్తాకథనం ఏంటి
మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా తన ఎలక్ట్రిక్ SUV లైన్‌లో ఒక ప్రత్యేకతగా 'ఎక్స్ఈవీ 9E సినీలక్స్ ఎడిషన్'ను ప్రారంభించింది. ఈ ఎడిషన్‌లో లగ్జరీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని సమీకరించి ప్రయాణికులకు అత్యుత్తమ సౌకర్యాన్ని, వినూత్న డ్రైవింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యం. ప్రత్యేక ఫినిషింగ్, ప్రీమియం ఇంటీరియర్స్, హై-ఎండ్ ఫీచర్లతో ఈ SUV స్టాండర్డ్ ఎక్స్ఈవీ 9E శక్తి, పనితీరు, రేంజ్‌ను కొనసాగిస్తూ మరింత విలాసవంతమైన అనుభవాన్ని ఇస్తుంది.
Details
ఎక్స్టీరియర్
సినీలక్స్ ఎడిషన్ శాటిన్ బ్లాక్, శాటిన్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఈ ప్రత్యేక ఫినిషింగ్ SUVకి ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. చిన్నపాటి మార్పులతో మహీంద్రా ఆధునిక ఎలక్ట్రిక్ గుర్తింపును ప్రతిబింబిస్తుంది. ఇంటీరియర్ & ఫీచర్లు లెదరెట్ ఫినిషింగ్‌లో చెస్ట్‌నట్ బ్రౌన్, నోక్టర్న్ బ్లాక్ కలర్‌లోని స్మూత్ ఇంటీరియర్ వాస్తవానికి విలాసవంతమైన లాంజ్ లాగా అనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ అంతటా విస్తరించి ఉన్న 'కోస్ట్-టు-కోస్ట్' ట్రిపుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. 16 స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ డాల్బీ అట్మోస్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇన్ఫినిటీ రూఫ్, యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ లాంటి లైటింగ్ ఫీచర్లు.
Details
అదనపు టెక్నాలజీ
'స్ట్రైట్ అహెడ్ విజన్ ఎక్స్' (ఏఆర్ హెడ్-అప్ డిస్‌ప్లే), ఐడెంటిటీ (డ్రైవర్-ప్యాసింజర్ మానిటరింగ్), హ్యాండ్స్-ఫ్రీ పార్క్ అసిస్ట్, సెక్యూర్ 360 సేఫ్టీ సూట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో ఈ SUV ప్రత్యేకతను పెంచుతోంది. క్యాంప్, కీప్, పా-పాల్ హెచ్‌వీఏసీ మోడ్‌లు, డిజిటల్ కీ, పర్సనలైజ్డ్ యూజర్ ప్రొఫైల్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ & రేంజ్ 79 kWh సామర్థ్యం గల బ్యాటరీతో SUV ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 500 కి.మీకు పైగా రియల్ వరల్డ్ రేంజ్ ఇస్తుంది. నగర ప్రయాణాలు లేదా హైవే డ్రైవ్‌లకు ఇది అనుకూలంగా ఉంటుంది.
Details
బుకింగ్ & ధర
భారత మార్కెట్లో ఎక్స్శోరూమ్ ధర రూ. 29.35 లక్షలు. బుకింగ్స్ మార్చి 2, 2026 నుండి ప్రారంభమవుతాయి. డెలివరీలు మార్చి 10, 2026 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ SUV ప్రీమియం లుక్స్, ఆధునిక టెక్నాలజీ, విశేష రేంజ్, లగ్జరీ ఫీచర్లు కలిపి మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో కొత్త ప్రాముఖ్యతను తెచ్చేలా ఉంది.