
Komaki electric moped: స్మార్ట్‌ఫోన్ ధరలో స్మార్ట్ స్కూటర్.. కొమాకి ఈవీ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
కొమాకి తన నూతన ఎక్స్‌ఆర్ఐ సిరీస్ ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రత్యేకమైన డిజైన్‌తో, సిటీ రైడింగ్‌కు అనువైన ఫీచర్లతో ఈ మోడల్‌ను రూపొందించారు. పురుషులతో పాటు మహిళలకూ సులభంగా నడిపేలా రూపొందించిన ఈ మోపెడ్, రోజువారీ అవసరాల కోసం, ఆఫీసుకు వెళ్లేందుకు, స్నేహితులతో చక్కర్లు కొట్టేందుకు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది. ఈమోడల్ ధర తక్కువగా ఉన్నప్పటికీ, అందించిన ఫీచర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. పూర్తి చార్జ్‌లో సుమారు 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రఫ్ఫ్ రోడ్లపై కూడా సాఫీగా నడిచేలా శక్తివంతమైన షాక్ అబ్సార్బింగ్ సస్పెన్షన్, హై గ్రిప్ టైర్లు ఇందులో ఏర్పాటు చేశారు.
Details
అత్యంత తక్కువ ధరకే లభ్యం
ఇద్దరూ సౌకర్యంగా కూర్చొనగలిగే రెండు సీట్లు, ముందు భాగంలో బాస్కెట్ ఉండడం దీని ప్రత్యేకత. నగర రద్దీ, చిన్న వీధుల్లో కూడా సులభంగా నడిపేలా రూపొందించిన ఈ వాహనం, భారత్‌లో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న లో స్పీడ్ ఎలక్ట్రిక్ మోపెడ్‌గా గుర్తింపు పొందుతోంది. దీని ధర రూ.29,999 మాత్రమే (ఎక్స్ షోరూమ్). ఇందులో ప్రత్యేకమైన రిజనరేటివ్ పవర్ సిస్టమ్ ఉండటం విశేషం. దీని ద్వారా బ్యాటరీ పూర్తిగా డిస్చార్జ్ అయినా కూడా కొంతవరకు ప్రయాణం కొనసాగుతుంది.
Details
ఇతర మోడళ్లతో పోల్చితే
ఓలా గిగ్ : రూ.32,999 (ఎక్స్ షోరూమ్), 25 కిమీ టాప్ స్పీడ్, 70 కిమీ రేంజ్. ఉజాస్ ఈగో ఎల్ఏ : రూ.34,880 (ఎక్స్ షోరూమ్), 60-75 కిమీ రేంజ్, 25 కిమీ వేగం. గ్రెటా హార్పర్ జెడ్ఎక్స్ సిరీస్-1 : రూ.41,999 ప్రారంభ ధర, 60-100 కిమీ రేంజ్ (బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది). హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎల్ఎక్స్ : రూ.59,640 (ఎక్స్ షోరూమ్), 85 కిమీ రేంజ్, 25 కిమీ వేగం. వీటిలో కొమాకి మోడల్ ధర పరంగా, ఫీచర్ల పరంగా సిటీ డ్రైవింగ్‌కు మంచి ఎంపికగా నిలుస్తోంది. వాహనాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ తరహా ఎలక్ట్రిక్ మోపెడ్‌లు కీలకంగా నిలవనున్నాయి.