Android Autoలో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
కార్లలో ఒకప్పుడు స్టీరిమో సిస్టమ్ ఉండటమే గొప్ప విషయం. తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఇన్ఫోటైన్ మెంట్ రంగంలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని కార్లలో ఆండ్రాయిడ్ ఆటో తరహా ఫీచర్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆటో బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం సరికొత్త ఫీచర్స్ తో ఇది ముందుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఆటోలో వీడియో కాన్ఫరెన్సింగ్, గేమింగ్, Youtube స్ట్రీమింగ్ కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఆటో అనేది కారులోని ఎంటర్టైన్మెంట్ నావిగేషన్, హెడ్ యూనిట్ కోసం డిజైన్ చేయబడి డ్రైవింగ్ కంపానియన్ యాప్ ను , గూగుల్ సంస్థ ఈ యాప్ ని పరిచయం చేసింది.
ఆండ్రాయిడ్ ఆటోతో ఎన్నో ప్రయోజనాలు
ఈ యాప్ ప్రధాన లక్షణం డ్రైవర్ కు అవసరమైన వివిధ రకాల సమాచారాన్ని తెలియజేయడం, వాయిస్ కమాండ్స్ ద్వారా కాల్స్ చేయటం, కాల్ ఆన్సర్, కాల్ డిస్ కనెక్ట్, మ్యూజిక్, మెసేజెస్ మొదలైన వాటిని ఈ యాప్ సాయంతో కంట్రో చేయవచ్చు. ప్రయాణీకులను, ముఖ్యంగా పిల్లలకు దూర ప్రయాణాల్లో వినోదాన్ని పంచేందుకు, Google ఇప్పుడు Android Auto ఇంటర్‌ఫేస్‌లో గేమ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వినియోగదారులను అనుమతి ఇచ్చింది. ఆండ్రాయిడ్ ఆటోలో కాన్ఫరెన్సింగ్ ఫంక్షన్‌ను ప్రారంభించడానికి సిస్కో, మైక్రోసాఫ్ట్, జూమ్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. అంటే ఆండ్రాయిడ్ యూజర్లు త్వరలో తమ కార్ డిస్‌ప్లే నుండి నేరుగా కాల్ చేయగలరు. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ వినియోగదారులను ఆడియో ద్వారా మాత్రమే చేరడానికి అనుమతిస్తుంది.