Page Loader
కియా సోనెట్ కొత్త వేరియంట్ లాంచ్.. మోడల్ ఫీచర్స్ ఇవే!
కియా సోనెట్​ కొత్త ఎడిషన్​ లాంచ్​

కియా సోనెట్ కొత్త వేరియంట్ లాంచ్.. మోడల్ ఫీచర్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2023
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ కియో మోటర్స్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఉన్న సోనెట్ కొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది. దీనిపేరు కియో సోనెట్ ఓరాక్స్. ఇదోక యూనివర్సరీ ఎడిషన్. హెచ్‌టీఎక్స్ వేరియంట్ ఆధారంగా ఈ కొత్త ఎడిషన్ ను కియో మోటర్స్ భారతమార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.11.85 లక్షలు,హెచ్ టీఎక్స్ కన్నా దీని ధర రూ. 40 వేలు అధికంగా ఉంది. ప్రపంచంలో అంతరించిపోతున్న 'ఓరాక్స్' జాతి పశువులకు గుర్తుగా ఈ కొత్త ఎడిషన్ కు కియో మోటర్స్ నామకరణం చేసింది. ఓరాక్స్ ఫ్రెంట్ ఫేస్, సైడ్స్​లో స్కిడ్​ ప్లేట్స్​, రేర్​లో టాంగెరైన్​ యాక్సెంట్స్​ వస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​ కూడా అదనంగా ఉంది.

Details

గట్టి పోటిని ఇస్తున్న కియో సోనెట్ ఓరాక్స్

కియా సోనెట్ ఓరాక్స్ గ్లేషియర్​ వైట్​ పర్ల్​, స్పార్క్​లింగ్​ సిల్వర్​, గ్రావిటీ గ్రే, ఆరోరా బ్లాక్​ పర్ల్​ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉన్నారు. 1.0 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​.. 118 బీహెచ్​పీ పవర్​ను, 172 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేయనుంది. ఇందులో నాలుగు ఎయిర్ బ్యాగ్స్ యాంటీ- లాక్​ బ్రేక్​ సిస్టెమ్​, ఎలక్ట్రానిక్​ బ్రేక్​ డిస్ట్రిబ్యూషన్​, ఎమర్జెన్సీ స్టాప్​ సిగ్నల్​, బ్రేక్​ అసిస్ట్​, ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​, హిల్​-స్టార్ట్​ అసిస్ట్​ కంట్రోల్​, వెహికిల్​ స్టెబులిటీ వంటి అద్భుత ఫీచర్స్ తో అకర్షణీయంగా రూపొందించారు. టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజా, కియా సోనెట్ వంటి మోడల్స్ కు ఈ కారు గట్టి పోటీని ఇవ్వనుంది.