Page Loader
త్వరపడండి.. హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ బుకింగ్స్ ప్రారంభం
హ్యుందాయ్​ ఎక్స్​టర్

త్వరపడండి.. హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ బుకింగ్స్ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2023
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత క్రేజీ ఫీచర్లతో వస్తున్న ఎక్స్ టర్ ఎస్యూవీకి సంబంధించి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.11వేలతో ఆన్‌లైన్‌లో ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని హ్యుందాయ్ మోటర్స్ సోమవారం వెల్లడించింది. సౌత్ కొరియాలో ఉన్న 'కాస్పర్'ను ఇండియాలో హ్యుందాయ్ మోటర్స్ ఎక్స్‌టర్‌గా విక్రయిస్తోంది. ఇది వెన్యూ, క్రేటా, టుక్సాన్ వంటి కంపెనీ మోడల్స్ సరసన ఇది చేరనుంది. ప్రస్తుతం ఇండియాలో ఎస్‌యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని హ్యుందాయ్ సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ఎక్స్‌టర్‌పైనే ఆ సంస్థ భారీ ఆశలను పెట్టుకుంది. ముఖ్యంగా యువత కోసం దీన్ని స్పేషల్ గా డిజైన్ చేసినట్లు సమాచారం.

Details

  కొత్త ఎస్​యూవీ ప్రారంభం ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు

ఎక్స్​టర్​ ఎస్​యూవీలో మూడు డ్యూయెల్​ టోన్​, ఆరు సింగిల్​ టోన్​ కలర్​ ఆప్షన్స్​ తో ప్రత్యేకంగా రూపొందించారు. రేంజర్​ ఖాఖీ షేడ్​ రంగుపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఎక్స్​టర్​ ఎస్​యూవీ సైడ్​లో అలాయ్​ వీల్స్​తో కూడిన స్క్వేర్డ్​ వీల్​ ఆర్చీస్​, సీ- పిల్లర్​కు డ్యూయెల్​ టోన్​, బ్లాక్​ రూఫ్​ రెయిల్స్​ ఉన్నాయి. రేర్​లో ఎస్​యూవీకి వ్రాప్​ అరౌండ్​ టెయిల్​లైట్స్​, ఫ్రెంట్​లో ఎల్​ఈడీ యూనిట్​ తరహా హెడ్​లైడ్స్​ తో లభించనుంది. సిట్రోయెన్​ సీ3, మారుతీసుజుగీ ఇగ్నిస్​, నిస్సాన్​ మాగ్నైట్​ వంటి మోడల్స్​కు ఈ కొత్త ఎస్‌యూవీ గట్టి పోటీని ఇవ్వనుంది. కొత్త ఎస్​యూవీ ప్రారంభం ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలుగా ఉండొచ్చు. లాంచ్​ డేట్​, స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​ వంటి వివరాలను సంస్థ వెల్లడించలేదు.