బోట్ నుంచి మరో బ్లూటూత్ స్మార్ట్ వాచ్ లాంచ్.. వారం రోజులు బ్యాటరీ లైఫ్
దేశీయ కంపెనీ బోట్ రోజు రోజుకూ సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తోంది. తాజాగా బోట్ స్ట్రామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 550 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉండే 2.5డి కర్వ్డ్ గ్లాస్ తో ఈ వాచ్ ప్రత్యేకంగా వస్తోంది. ముఖ్యంగా ఈఎన్ఎక్స్ అల్గారిథమ్ తో బ్లూటూత్ కాలింగ్ కు సపోర్టు చేయనుంది. హెల్త్ ఫీచర్లు, స్పోర్డ్స్ మోడ్ లను ఈ వాచ్ కలిగి ఉండడం విశేషం. బ్లూటూత్ వెర్షన్తో ఈ వాచ్ వచ్చింది. ENx అల్గారిథమ్‍తో కూడిన బ్లూటూత్ కాలింగ్‍కు ఈవాచ్ సపోర్ట్ చేస్తుంది. దీంతో ఫోన్‍కు కనెక్ట్ చేసుకొని ఈ స్మార్ట్‌వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడే అవకాశం ఉంటుంది.
నోటిఫికేషన్లు వాచ్ లోనే చూసుకొనే అవకాశం
ఎస్పీఓ 2 మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ హెల్త్ ఫీచర్తో ఈ స్మార్ట్ వాచ్ వచ్చింది. అదే విధంగా 100కు పైగా స్పోర్ట్స్ మోడ్ లను సపోర్టు చేయనుంది. ఇక ఫోన్ కు కనెక్ట్ చేసుకున్నప్పుడు మ్యూజిక్ ప్లే బ్యాక్, కెమెరాను కంట్రోల్ చేసుకొనే అవకాశం ఉంది. మన ఫోన్స్ కి వచ్చే నోటిఫికేషన్లనను వాచ్ లోనే చూడొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ లో 300mAh బ్యాటరీ ఉంది. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జీ చేస్తే వారం రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇవ్వనుంది. వాటర్, డస్ట్ రెసిస్టిన్స్ కోసం ఐపీ 68 రేటింగ్ ను ఈ వాచ్ కలిగి ఉంది. ఇది ఫ్లిప్ కార్ట్ లో రూ.1799 గా ఉండనుంది.