LOADING...
అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు
బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు

అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 07, 2023
06:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అశోక్ లేలాండ్ తో కలిసి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (H2-ICE)తో నడిచే భారతదేశపు మొట్టమొదటి హెవీ డ్యూటీ ట్రక్కును ఆవిష్కరించాయి. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని జెండా ఊపి ప్రారంభించారు. 2022 ఆగస్టు నుంచి ఇది టెస్టింగ్‌లో ఉంది. దానితో, అశోక్ లేలాండ్ 'ఆత్మనిర్భర్ భారత్' ప్రచారంలో భాగం కావాలనుకుంటుంది. ఇది డీజిల్ ట్రక్కులతో పోలిస్తే నిశ్శబ్దంగా ఉండడమే కాదు పర్యావరణ అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ, సరైన హైడ్రోజన్ ఇంధన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ వాహనాల కొనుగోలుదారులు ముందుగా కొంచెం ఖర్చు చేయవలసి ఉంటుంది. వీటి లభ్యత మరింత పెరిగాక, ధరలు తగ్గుతాయి.

ఆటోమొబైల్

ICE వాహనాలతో పోలిస్తే ఈ వాహనాల వలన చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది

H2-ICE ట్రక్ సిరీస్ డీజిల్ ఆధారిత ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే, హైడ్రోజన్‌ను శక్తిని ఉపయోగించుకుంటుంది.ఈ ట్రక్కులు 19-35 టన్నుల భారాన్ని మోయగలవు. అయితే మామూలు వినియోగానికి అందుబాటులో ఉండే ముందు రిలయన్స్ క్యాప్టివ్ ఫ్లీట్‌లో భాగంగా ఉంటాయి. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ రోడ్‌మ్యాప్ (హైడ్రోజన్ ఎనర్జీ డెవలప్‌మెంట్/డిప్లాయ్‌మెంట్ కోసం ఒక విజన్), నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ద్వారా ప్రచార కార్యక్రమాలపై పని చేసి వీటి లభ్యతను, ఉత్పత్తిని పెంచి ఈ అడ్డంకులను తొలగించడానికి కేంద్రం కృషి చేస్తోంది. ICE వాహనాలతో పోలిస్తే ఈ వాహనాల వలన చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. అయితే, ఇదంతా జరగడానికి చాలా సమయం పట్టచ్చు. క్లీన్ మొబిలిటీ మిషన్‌కు ప్రాజెక్ట్ కు సరిగ్గా సరిపోతుంది.