బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు
మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, హీరో మోటోకార్ప్, TVS మోటార్ కంపెనీ, అశోక్ లేలాండ్‌తో సహా దేశంలోని అగ్రశ్రేణి ఒరిజినల్ పరికరాల తయారీదారులు (OEMలు) ఆర్థిక మంత్రి సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023ని ప్రశంసించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను వృద్ధి ఆధారిత, ప్రగతిశీల బడ్జెట్ అని కొనియాడారు. ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధికి ఆర్థిక వ్యవస్థ మొత్తం వృద్ధికి సంబంధం ఉంది. అందుకే ఆర్థిక వ్యవస్థ మొత్తం వృద్ధికి సహాయపడే బడ్జెట్ ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన అమృత్ కాల్‌కు సంబంధించిన 'సప్తఋషి' అనే ఏడు అంశాలు ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తాయి.
వృద్ధికి తోడ్పాటును అందించే ద్రవ్యోల్బణం, బ్యాంకు వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకోవాలి
ఆదాయపు పన్ను తగ్గింపుతో, ఆదాయం పెరుగుతుంది. క్యాపెక్స్‌కు సంబంధించిన ప్రకటనలు, ఆర్థిక వ్యవస్థ డిమాండ్, సరఫరా రెండింటిపై మరింత సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది డిమాండ్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. రైల్వేలు, పెరిగిన వ్యవసాయ రుణ లక్ష్యం, స్క్రాపేజ్‌పై విధానాలు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వంటివి ఈ రంగాలలో పెట్టుబడి కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయినా సరే వృద్ధిని ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, బ్యాంకు వడ్డీ రేట్లు, లిక్విడిటీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మౌలిక సదుపాయాల కోసం మెరుగైన మూలధన బడ్జెట్ వ్యయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కేంద్రాలు, వాహనాల రీప్లేస్‌మెంట్, లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి కస్టమ్స్ సుంకం మినహాయింపుపై ప్రకటనలు భారతీయ ఆటో పరిశ్రమకు మంచి భవిష్యత్తునిస్తాయి.