LOADING...
Ather Rizta: రోజుకు 410 స్కూటర్లు అమ్ముడవుతున్న అథర్ రిజ్టా.. రెండేళ్లలో 3 లక్షల అమ్మకాలు
రోజుకు 410 స్కూటర్లు అమ్ముడవుతున్న అథర్ రిజ్టా.. రెండేళ్లలో 3 లక్షల అమ్మకాలు

Ather Rizta: రోజుకు 410 స్కూటర్లు అమ్ముడవుతున్న అథర్ రిజ్టా.. రెండేళ్లలో 3 లక్షల అమ్మకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 11, 2026
07:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ Ather Energy తమ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'రిజ్టా' భారీ రికార్డు సృష్టించినట్లు ప్రకటించింది. 2024ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి వచ్చిన అథర్ రిజ్టా కేవలం రెండేళ్లలోనే 3లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. అంటే సగటున రోజుకు దాదాపు 410స్కూటర్లు అమ్ముడయ్యాయని కంపెనీ వెల్లడించింది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్ అథర్‌కు కొత్త మార్కెట్లలో భారీగా గుర్తింపు తీసుకొచ్చింది. 2025 డిసెంబర్‌లో 2లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకున్న రిజ్టా..ఆ తర్వాత కేవలం ఐదు నెలల్లోనే మరో లక్ష యూనిట్లు విక్రయించింది. దీంతో కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ పేర్కొంది.

వివరాలు 

ఈ రాష్ట్రాలలో నాలుగు రెట్లు పెరిగిన అథర్ మార్కెట్ షేర్ 

ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో అథర్ మార్కెట్ షేర్ నాలుగు రెట్లు పెరిగిందని వెల్లడించింది. అథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ.. రిజ్టాను ప్రత్యేకంగా ఫ్యామిలీ స్కూటర్‌గా రూపొందించామని, దేశవ్యాప్తంగా కుటుంబ వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. దక్షిణ భారత మార్కెట్లో FY26లో లీడర్‌షిప్ స్థానం దక్కించుకోవడంలో రిజ్టా కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం అమ్మకాలలో రిజ్టా వాటా సుమారు 76 శాతంగా ఉందని వెల్లడించారు.

వివరాలు 

22 లీటర్ల ఫ్రంక్

ఈ స్కూటర్‌లో పెద్ద సీటు, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, మొత్తం 56 లీటర్ల స్టోరేజ్ స్పేస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌తో పాటు 22 లీటర్ల ఫ్రంక్ కూడా ఉంది. అలాగే స్కిడ్ కంట్రోల్, థెఫ్ట్ అలర్ట్స్, టో అలర్ట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల OTA అప్‌డేట్ ద్వారా టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది అథర్.

Advertisement