Audi: 1930ల రేసింగ్ కారుకు కొత్త జీవం.. V16 లుక్కాను ఆవిష్కరించిన ఆడి
ఈ వార్తాకథనం ఏంటి
ఆడి 1930ల రేసింగ్ లెజెండ్‌కు కొత్త రూపంలో ప్రాణం పోసింది. 'లుక్కా' అనే ఈ కొత్త కారు సాధారణ మోడల్ కాదు.. పాత కాలం రేసింగ్ కారుకు ఆధునిక రూపం. ఇందులో 6.0 లీటర్ V16 ఇంజిన్ ఉండగా, మెథనాల్‌పై నడుస్తుంది. ఇది మాస్ ప్రొడక్షన్ కోసం కాదు.. ఒకే ఒక్క యూనిట్‌గా రూపొందించిన ప్రాజెక్ట్. ఇంగోల్ష్టాట్‌లోని Audi Tradition ఆధ్వర్యంలో రూపొందించారు. బ్రిటన్‌కు చెందిన మోటార్ స్పోర్ట్స్ నిపుణులు Crosthwaite & Gardiner ఈ కారును నిర్మించారు. మూడు సంవత్సరాల కష్టం,భారీ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. 'లుక్కా'అనే పేరు ఇటలీలోని Lucca నగరం నుంచి వచ్చింది. 1930ల్లో అక్కడే Auto Union రేసింగ్ కార్లు స్పీడ్ రికార్డులు నెలకొల్పాయి.
వివరాలు
కొత్త మోడల్ 6.0 లీటర్ ఇంజిన్‌తో 520 హార్స్‌పవర్
ఆ కాలంలో లుక్కా 5.0 లీటర్ V16 ఇంజిన్‌తో 343 హార్స్‌పవర్ ఇచ్చేది. ఇప్పుడు కొత్త మోడల్‌లో 6.0 లీటర్ ఇంజిన్‌తో 520 హార్స్‌పవర్ అందిస్తుంది. పాలిష్డ్ మాన్యువల్ గేర్ లింకేజీ, చేతితో తయారు చేసిన ప్యానెల్స్, 'సెల్యులోజ్ సిల్వర్' పెయింట్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ కారును అప్పుడప్పుడు డెమో కోసం మాత్రమే ఉపయోగించనున్నారు. పూర్తి స్థాయిలో టెస్ట్ చేయాలనే ఉద్దేశం లేదు. అయినా ఈ లుక్కా మోడల్ ఆడి యొక్క గొప్ప రేసింగ్ చరిత్రను, ఇంజినీరింగ్ ప్రతిభను ప్రతిబింబిస్తుంది.