
125సీసీతో కాలేజీ యూత్‌ను మెప్పిస్తున్న ఈ స్కూటీల గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
గతంలో స్కూటీ అంటే కేవలం అమ్మాయిలకు మాత్రమే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా స్కూటీలను ఇష్టపడుతున్నారు.
స్కూటీలు కుడా 125సీసీతో బైక్స్‌కి పోటీనిస్తున్నాయి. ప్రస్తుతం 125సీసీ సామర్థ్యం గల స్కూటీల వివరాలు తెలుసుకుందాం.
సుజుకి యాక్సెస్ 125:
పట్టణాలు, నగరాల్లో కాలేజీకి వెళ్లేవారికైనా, అఫీసులకు వెళ్లేవారికైనా ఈ స్కూటీ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. 124సీసీ సామర్థ్యం గల ఈ స్కూటీ సింగిల్ సిలిండర్‌ను కలిగి ఉంటుంది.
8.5bhp శక్తితో 10Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర 79,400 నుండి 89500 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది.
Details
విభిన్నమైన రంగుల్లో ఆకట్టుకునే వెస్పా స్కూటీ
టీవీఎస్ ఎన్ టార్క్ 125:
124.8 సీసీ సామర్థ్యం గల ఈ స్కూటీ, లుక్ పరంగా స్టైలిష్‌గా ఉంటుంది. 9.2ఈ ఇంజిన్ 9.2bhp శక్తి, 10.5Nm టార్క్ ఉత్పత్తి చేసే ఈ స్కూటీ, సింగిల్ సిలిండర్‌ను కలిగి ఉంటుంది.
RT-Fiతో ఎయిర్ కూల్డ్ ఇంజన్ గల ఈ స్కూటీ ధర 84,536రూపాయల నుంచి1.04 లక్షల రూపాయల(ఎక్స్‌షోరూం) వరకు ఉంటుంది.
వెస్పా 125:
స్కూటీలలో వెస్పా స్కూటీలు విభిన్నంగా ఉంటాయి. విభిన్నమైన రంగుల్లో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మాట్లాడుకోబే వెస్పా 125 స్కూటీ, VXL, SXL అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
124.45సీసీ, సింగిల్ సిలిండర్, 9.8bhp ఎనర్జీ, 9.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే స్కూటీ ధర 1.32లక్షల-1.37లక్షల మధ్య ఉంటుంది.
Details
స్మార్ట్ మోటర్ జెనరేటర్ ను కలిగి ఉండే స్కూటీ
హోండా డియో 125:
123సీసీ, సింగిల్ సిలిండర్, 8.19bhp ఎనర్జీ, 10.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఈ స్కూటీ ధర, 83,400-91,300(ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఇండియాలో 125సీసీ సామర్థ్యం గల స్కూటీలను ఎక్కువగా అమ్మిన ఘనత హోండాకే సొంతం.
యమహా ఫాసినో 125:
సింగిల్ సిలిండర్, 8.04bhp ఎనర్జీ, 10.3Nm టార్క్ ఉత్పత్తి చేసే ఈ స్కూటీ, స్మార్ట్ మోటార్ జెనరేటర్ ను కలిగి ఉంటుంది. ఈ స్కూటీ ధర 79,100రూపాయల నుండి 92,830రూపాయల వరకు ఉంది.