Bajaj New Chetak: 20న మార్కెట్లోకి బజాజ్ చేతక్.. కొత్త వెర్షన్‌లో మెరుగైన ఫీచర్లు
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2020లో తొలి చేతక్ స్కూటర్‌ను మార్కెట్లోకి బజాజ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన ఈవీ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి కొత్త వెర్షన్‌ను డిసెంబర్ 20న రిలీజ్ చేయనుంది. చేతక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. కొత్త వెర్షన్‌తో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేయాలని కోరుకుంటోంది. విద్యుత్ వాహన రంగంలో ఓలా, టీవీఎస్, ఏథర్ వంటి ప్రతిపక్షాల నుండి కఠినమైన పోటీ ఎదుర్కొంటున్న బజాజ్, తన విక్రయాలను పెంచుకోవడం లక్ష్యంగా కొత్త స్కూటర్‌ను విడుదల చేస్తోంది.
కొత్త వెర్షన్ ధర ఎక్కువగా ఉండే అవకాశం
కొత్త చేతక్ స్కూటర్ ఫీచర్లలో ఫ్లోర్‌బోర్డ్ కింద బ్యాటరీ ప్యాక్‌ను ఉంచడం ద్వారా కార్గో స్పేస్ పెరగనుంది. సింగిల్ ఛార్జ్‌లో 123 నుంచి 137 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వనుంది. ఈ వాహనంలో హ్యాండ్లింగ్, రైడ్ నాణ్యత కూడా మెరుగుపడింది. ప్రస్తుతం బజాజ్ చేతక్ ధరలు రూ. 96,000-రూ.1,29,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. అయితే కొత్త వెర్షన్ ధరలు కొంత ఎక్కువగా ఉండే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.