Page Loader
2025 Bajaj Dominar 400: బజాజ్ డొమినార్ 2025 లాంచ్‌.. స్పోర్ట్స్ టూరింగ్ బైక్ ధరలు ఇదే!
బజాజ్ డొమినార్ 2025 లాంచ్‌.. స్పోర్ట్స్ టూరింగ్ బైక్ ధరలు ఇదే!

2025 Bajaj Dominar 400: బజాజ్ డొమినార్ 2025 లాంచ్‌.. స్పోర్ట్స్ టూరింగ్ బైక్ ధరలు ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్‌ టూ-వీలర్‌ మార్కెట్‌లో ప్రముఖ ఆటో తయారీ సంస్థ బజాజ్‌ ఆటో, తన ప్రఖ్యాత టూరింగ్ స్పోర్ట్స్ బైక్‌ శ్రేణికి 2025లో మెరుగుదలు చేసింది. తాజా వెర్షన్‌గా 2025 బజాజ్ డొమినార్ 250, డొమినార్ 400 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండింటిలోనూ ఆధునిక సాంకేతికత, మెరుగైన ఎర్గోనామిక్స్‌తో పాటు టూరింగ్‌కు మరింత అనుకూలమైన లక్షణాలను జోడించారు. దీర్ఘ ప్రయాణాలను మరింత సౌకర్యంగా చేయడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. ధర వివరాలు 2025 బజాజ్ డొమినార్ 400 బైక్‌ ధరను రూ. 2,38,682 (ఎక్స్‌-షోరూమ్)గా, డొమినార్ 250 బైక్‌ ధరను రూ. 1,91,654 (ఎక్స్‌-షోరూమ్)గా సంస్థ ప్రకటించింది.

Details

2025 బజాజ్ డొమినార్ 400 హైలెట్స్ 

రైడ్-బై-వైర్ టెక్నాలజీ : ఈ ఫీచర్‌తో బైక్‌కు ఎలక్ట్రానిక్ థ్రోటిల్ బాడీ లభించింది. నాలుగు రైడింగ్ మోడ్‌లు : రోడ్‌, రెయిన్‌, స్పోర్ట్‌, ఆఫ్‌-రోడ్‌ — వీటిని మారుస్తూ వేరే వేరే రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా రైడింగ్‌ చేయొచ్చు. బాండెడ్ గ్లాస్ LCD డిస్‌ప్లే: దీనిపై బైక్‌కు సంబంధించిన పూర్తి సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ GPS మౌంట్, అధునాతన నియంత్రణ స్విచ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. నూతన ఎర్గోనామిక్ హ్యాండిల్‌బార్ డిజైన్ కూడా వృద్ధి చేయబడింది.

Details

 2025 బజాజ్ డొమినార్ 250 విశేషాలు

డొమినార్ 400 మాదిరిగానే ఇందులోనూ నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అయితే ఇవి ABS-ఎనేబుల్డ్ రైడ్ మోడ్‌లు. టూరింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మిగతా అన్ని ఫీచర్లు డొమినార్ 400లో ఉన్నవే. మొత్తంగా చూస్తే, బజాజ్ తాజా డొమినార్ మోడల్స్ టూరింగ్‌ ప్రియుల కోసం ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్నాయి. ఆధునిక టెక్నాలజీ, వినియోగదారుల సౌకర్యానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన ఈ బైకులు, టూరింగ్‌ బైక్‌ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను ఏర్పరచే అవకాశముంది.