
Pulsar N150: పల్సర్ N-150కి గుడ్‌బై చెబుతున్న బజాజ్.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో తన పల్సర్ N150 మోటార్‌సైకిల్‌ను మార్కెట్ నుంచి వైదొలిగించనుంది. ఇటీవల ఈ మోడల్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించడం గమనార్హం. దీనితో ఈ మోటార్‌సైకిల్ తయారీని నిలిపివేసినట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పల్సర్ N150ను కంపెనీ 2023 సెప్టెంబరులో లాంచ్ చేసింది. కానీ తక్కువ వ్యవధిలోనే దీన్ని నిలిపివేయడాన్ని బట్టి ఇది మార్కెట్లో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2024 మేలో బజాజ్ పల్సర్ క్లాసిక్, ఎన్150 మోడల్స్ కలిపి కేవలం 15,937 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇదే కాలంలో 2023 మేలో అమ్మకాలు 29,386 యూనిట్లు ఉండటం గమనార్హం.
Details
అధికారిక ప్రకటన ఇవ్వని సంస్థ
ఈ క్షీణత వల్లే బజాజ్ పల్సర్ N150ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాదు, బజాజ్ తన లైనప్‌లోని మరో మోడల్ అయిన పల్సర్ 150 క్లాసిక్‌ను కూడా రాబోయే రోజుల్లో నిలిపివేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బజాజ్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. బజాజ్ పల్సర్ N150 - ఇంజిన్, ఫీచర్లు ఈ బైక్ 149.68cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 14.3 bhp పవర్, 13.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది, ఇది అన్ని వాతావరణాల్లో స్మూత్‌గా పని చేస్తుంది.
Details
ఫీచర్లు ఇవే
రైడర్ భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ (Anti-lock Braking System) సదుపాయం కలిగి ఉంది. ఫ్రంట్ భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ వాడారు. ఇంకా 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బైక్‌కి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో మైలేజ్, వేగం, బ్యాటరీ స్థితి తదితర సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. ధర & భవిష్యత్తు అప్‌డేట్ పల్సర్ N150 బైక్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ. 1.38 లక్షలు. అయితే తాజా సమాచారం ప్రకారం, బజాజ్ సంస్థ త్వరలోనే దీనికి అప్‌డేటెడ్ వేరియంట్‌ను తీసుకురానుంది.