LOADING...
Bajaj Pulsar N160: కొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ N160.. గోల్డెన్ USD ఫోర్క్స్‌తో అదిరిపోయే లుక్!
కొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ N160.. గోల్డెన్ USD ఫోర్క్స్‌తో అదిరిపోయే లుక్!

Bajaj Pulsar N160: కొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ N160.. గోల్డెన్ USD ఫోర్క్స్‌తో అదిరిపోయే లుక్!

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

బజాజ్ ఆటో తన ప్రముఖ బైక్ పల్సర్ N160 శ్రేణిలో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్‌ను ప్రారంభ ధర రూ.1.22 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఫీచర్లు, ప్రీమియం స్టైలింగ్‌తో యువతను ఆకట్టుకునేలా ఈ బైక్‌ను అప్‌డేట్ చేసినట్లు సంస్థ తెలిపింది. స్పోర్టీ పనితీరు, మెరుగైన బ్రేకింగ్, స్టైలిష్ డిజైన్ కలయికగా ఈ మోడల్ ఉంటుందని పేర్కొంది. కొత్త బజాజ్ పల్సర్ N160లో గోల్డెన్ USD ఫోర్క్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే ABS టెక్నాలజీ, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లను జోడించారు. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, సింగిల్ పీస్ సీట్ సెటప్ కూడా ఇందులో ఉన్నాయి.

వివరాలు 

కలర్ ఆప్షన్లు

ఇవి రైడింగ్ సమయంలో మరింత కంఫర్ట్‌తో పాటు మంచి హ్యాండ్లింగ్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. అయితే బైక్‌లోని మిగతా అంశాల్లో పెద్దగా మార్పులు చేయలేదు.పెర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, గ్రే, బ్రూక్లిన్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా యథాతథంగానే ఉంది. పల్సర్ N160 ప్రస్తుతం సింగిల్ ఛానల్, డ్యూయల్ ఛానల్, డ్యూయల్ ఛానల్ USD, డ్యూయల్ ఛానల్ స్ప్లిట్ సీట్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.1.16 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త పల్సర్ N160లో 164.82 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించారు.

వివరాలు 

డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్

ఈ ఇంజిన్ 15.7 bhp పవర్, 14.65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. 17 అంగుళాల అలాయ్ వీల్స్‌తో వచ్చే ఈ బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్‌ను కలిగి ఉంది. నెగటివ్ LCD డిస్‌ప్లే ద్వారా అవసరమైన రైడింగ్ సమాచారం అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ట్యాంక్‌పై USB ఛార్జర్‌ను కూడా ఏర్పాటు చేశారు. మార్కెట్లో ఈ బైక్ టీవీఎస్ అపాచే RTR 160, సుజుకి జిక్సర్, యమహా FZ, హీరో ఎక్స్‌ట్రీమ్ 160 4V వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.

Advertisement