LOADING...
Volvo Car: వోల్వో కస్టమర్లకు బిగ్ షాక్.. మే 1 నుంచి కార్ల ధరలు పెంపు
వోల్వో కస్టమర్లకు బిగ్ షాక్.. మే 1 నుంచి కార్ల ధరలు పెంపు

Volvo Car: వోల్వో కస్టమర్లకు బిగ్ షాక్.. మే 1 నుంచి కార్ల ధరలు పెంపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

వోల్వో కార్ ఇండియా తన వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మే 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ ధరల పెంపు గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు ఉండనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే దారిలో ఇప్పటికే ఆడి, మెర్సిడెస్-బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ బ్రాండ్లు కూడా ధరలను సవరించాయి. కంపెనీ ప్రకారం, గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు ఇంకా పూర్తిగా తగ్గకపోవడం, విదేశీ మారక విలువల (ఫారెక్స్) హెచ్చుతగ్గులు కొనసాగడం వల్ల ఖర్చులు పెరిగాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌకాశ్రయ రవాణాపై ప్రభావం చూపడం వల్ల ముడి పదార్థాల ధరలు పెరిగినట్లు పేర్కొంది.

వివరాలు

గరిష్ఠంగా రూ.1లక్ష వరకు పెంపు

భారత్‌లో వోల్వో పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ మోడల్స్ Volvo EX30, Volvo EC40తో పాటు పెట్రోల్/డీజిల్ ఇంజిన్‌తో పనిచేసే Volvo XC60, Volvo XC90 ఉన్నాయి. ప్రతి మోడల్‌పై ఖచ్చితమైన పెంపు ఎంతన్నది వెల్లడించకపోయినా, అన్ని వేరియంట్లకు కలిపి గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు మాత్రమే పెంపు ఉంటుందని తెలిపింది. ఉత్పత్తి నాణ్యత, భద్రతా ప్రమాణాలు, కస్టమర్ సేవలలో ఎలాంటి రాజీ పడకుండా కొనసాగించేందుకు ఈ ధరల సవరణ అవసరమైందని కంపెనీ అధికారులు స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక ఒత్తిడులు ఇలాగే కొనసాగితే మరిన్ని ధరల పెంపులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. కొత్త ధరలు మే 1 నుంచి బుకింగ్స్, డెలివరీలకు వర్తించనున్నాయి.

వివరాలు

దేశ వ్యాప్తంగా 23 షోరూమ్స్

దీంతో ప్రస్తుతం కొనుగోలు చేయాలని భావిస్తున్న కస్టమర్లకు ప్రస్తుత ధరలకే వాహనాలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 23 షోరూమ్స్, 25 సర్వీస్ సెంటర్లతో వోల్వో తన విస్తరణను కొనసాగిస్తోంది. లగ్జరీ కార్ల విభాగంలో దిగుమతి భాగాలపై ఆధారపడటం, కరెన్సీ మార్పుల ప్రభావం వంటి అంశాల వల్ల ధరల పెంపు ట్రెండ్ కొనసాగుతోంది. ఎలక్ట్రిక్, సంప్రదాయ వాహనాల కలయికతో ముందుకు సాగుతున్న వోల్వోకు పోటీ సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడం ఒక సవాల్‌గా మారింది. ప్రస్తుతం Volvo EX30వంటి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలేదా Volvo XC90 వంటి ఫ్లాగ్‌షిప్ మోడల్ కొనాలని చూస్తున్న వినియోగదారులు త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరిగినా, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ అనుకూలతతో వోల్వోపై ఆసక్తి కొనసాగుతోంది.

Advertisement