LOADING...
BMW F 450 GS: ఏప్రిల్ 23న భారత్‌లో BMW F 450 GS లాంచ్.. పూర్తి వివరాలు ఇవే
ఏప్రిల్ 23న భారత్‌లో BMW F 450 GS లాంచ్.. పూర్తి వివరాలు ఇవే

BMW F 450 GS: ఏప్రిల్ 23న భారత్‌లో BMW F 450 GS లాంచ్.. పూర్తి వివరాలు ఇవే

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీకి చెందిన ప్రముఖ బైక్ తయారీ సంస్థ BMW Motorrad తమ కొత్త అడ్వెంచర్ టూరింగ్ బైక్ BMW F 450 GSను ఏప్రిల్ 23న భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విదేశాల్లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ బైక్,భారత్‌లో మాత్రం Bharat Mobility Global Auto Expo 2025లో కాన్సెప్ట్‌గా మాత్రమే కనిపించింది. ఇప్పుడు మొదటిసారి ప్రొడక్షన్ మోడల్ రూపంలో రానుంది. ఈ బైక్‌లో 420cc పరల్లెల్ ట్విన్ ఇంజిన్ ఉండి 48 హార్స్ పవర్, 43 Nm టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్,క్విక్ షిఫ్టర్ కూడా ఉన్నాయి.

వివరాలు 

ధర సుమారు రూ.5 లక్షలు 

సస్పెన్షన్ విషయంలో ముందు USD ఫోర్క్స్,వెనుక మోనోషాక్ ఏర్పాటు చేశారు. 19-ఇంచ్ ముందు, 17-ఇంచ్ వెనుక వీల్స్‌తో డ్యూయల్ పర్పస్ టైర్లు ఇస్తారు. డిజైన్ పరంగా ఇది పెద్ద మోడల్ అయిన BMW R 1300 GSలా కనిపిస్తుంది. ముందుభాగంలో బీక్ డిజైన్,పెద్ద ఫెయిరింగ్‌తో అడ్వెంచర్ లుక్ ఇస్తుంది. అలాగే స్ప్లిట్ సీట్,ర్యాలీ సీట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫీచర్స్ విషయానికి వస్తే 6.5-ఇంచ్ TFT డిస్‌ప్లే, హీటెడ్ గ్రిప్స్,నాలుగు రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్,డ్యూయల్ ఛానల్ ABS వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఈ బైక్ KTM 390 Adventure,Royal Enfield Himalayan 450 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.ధర సుమారు రూ.5 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Advertisement