BMW i7 Facelift: బీఎండబ్ల్యూ ఐ7 Facelift వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్, అదిరిపోయే ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో తన కొత్త 2026 బీఎండబ్ల్యూ i7 Facelift ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేసింది. కొత్త i7 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.95 కోట్లుగా ఉంది. అధునాతన డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, భారీ స్క్రీన్లు, శక్తివంతమైన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ఈ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. కొత్త BMW i7లో ప్రధాన ఆకర్షణగా 728 కిలోమీటర్ల వరకు WLTP రేంజ్ నిలుస్తోంది. గత మోడల్‌తో పోలిస్తే కొత్త వెర్షన్ సుమారు 125 కిలోమీటర్ల అదనపు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
వివరాలు
కొత్త డిజైన్ ఎలా ఉంది?
2026 BMW i7 Faceliftలో పాత మోడల్‌కు కొనసాగింపుగా ఉండే ఓవరాల్ డిజైన్‌ను కొనసాగించారు. అయితే ముందు భాగంలో మాత్రం పలు మార్పులు చేశారు.
కొత్త మోడల్‌లో ఇల్యూమినేటెడ్ సరౌండ్‌తో మరింత స్క్వేర్ ఆకారంలో ఉండే కిడ్నీ గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేసిన LED హెడ్‌లైట్లు ఉన్నాయి.
ఇవి కారుకు మరింత ప్రీమియం, ఆధునిక లుక్‌ను అందిస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌ను అందించారు. మిగతా డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు.
వెనుక భాగంలోనూ మార్పులు
కారు వెనుక భాగంలో కొత్త టెయిల్‌గేట్, స్మోక్డ్ లెన్స్‌తో రీడిజైన్ చేసిన LED టెయిల్‌ల్యాంప్స్, కొత్త రియర్ బంపర్‌ను అందించారు.
వివరాలు
17.9 ఇంచుల టచ్‌స్క్రీన్
అదే సమయంలో స్పోర్టియర్ i7 M70 xDrive వేరియంట్‌లో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్, M బ్యాడ్జింగ్, పెద్ద 31-ఇంచుల అలాయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
కొత్త BMW i7లో అత్యాధునిక టెక్నాలజీకి పెద్దపీట వేశారు. ఇందులో 17.9 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.
అదనంగా 14.6 ఇంచుల ప్యాసింజర్ స్క్రీన్, BMW X OS ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు.
వైర్‌లెస్ Apple CarPlay, Android Auto కూడా ఇందులో ఉన్నాయి. కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఈ కారులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
వివరాలు
వెనుక సీటులో 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్
BMW i7లో వెనుక సీటు ప్రయాణికుల కోసం భారీ 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్‌ను అందించారు.
లగ్జరీ ప్రయాణ అనుభూతిని మరింత పెంచేందుకు ఈ స్క్రీన్‌తో పాటు Dolby Atmos సపోర్ట్ ఉన్న Bowers & Wilkins సౌండ్ సిస్టమ్‌ను కూడా అందించారు.
ఇక కారులో పనోరమిక్ గ్లాస్ రూఫ్, బాస్ మోడ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, Level-2 ADAS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
లగ్జరీ సీట్లు.. ప్రీమియం ఫీచర్లు
BMW i7లో ప్రయాణికుల సౌకర్యానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ఇందులో పవర్డ్ గేట్స్, హీటెడ్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, మసాజ్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, Level-2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.
వివరాలు
112.5kWh బ్యాటరీ.. 728 కి.మీ రేంజ్
2026 BMW i7లో 112.5kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ బ్యాటరీతో కారు WLTP సైకిల్ ప్రకారం 728 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.
గత మోడల్‌తో పోలిస్తే కొత్త i7సుమారు 125కిలోమీటర్ల అదనపు రేంజ్‌ను అందిస్తుందని BMW తెలిపింది.
ఎక్కువ రేంజ్ కారణంగా లాంగ్-డిస్టెన్స్ ప్రయాణాలకు కూడా ఈ ఎలక్ట్రిక్ సెడాన్ అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.
455 hp పవర్.. 5.5 సెకన్లలో 0-100 kmph
పవర్ పరంగా కూడా BMW i7 ఆకట్టుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 455 hp పవర్, 600 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
వివరాలు
BMW i7 Facelift ధర ఎంతంటే?
కారు కేవలం 5.5సెకన్లలో 0నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 210 kmphగా ఉంది.
భారత మార్కెట్లో కొత్త 2026 BMW i7 Facelift ఎక్స్-షోరూమ్ ధర రూ.1.95 కోట్లుగా ఉంది.
728 కిలోమీటర్ల వరకు రేంజ్, 8K థియేటర్ స్క్రీన్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ADAS, మసాజ్ సీట్లు, అధునాతన కనెక్టివిటీ వంటి ఫీచర్లతో కొత్త BMW i7 భారత లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మరింత ప్రీమియం ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.