LOADING...
BMW : ₹74.5 లక్షల ధరతో BMW X3 xDrive30 M Sport Pro విడుదల
₹74.5 లక్షల ధరతో BMW X3 xDrive30 M Sport Pro విడుదల

BMW : ₹74.5 లక్షల ధరతో BMW X3 xDrive30 M Sport Pro విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఎండబ్ల్యూ ఇండియా తన X3 మోడల్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. X3 xDrive30 M Sport Pro పేరుతో విడుదలైన ఈ ఎస్‌యూవీ ధరను ఎక్స్‌షోరూమ్‌గా ₹74.5 లక్షలుగా నిర్ణయించారు. చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్ ప్లాంట్‌లోనే తయారైన ఈ వాహనం దేశవ్యాప్తంగా ఉన్న బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌లలో బుకింగ్‌కు అందుబాటులో ఉంది. ఇప్పటికే ఉన్న xDrive 20 పెట్రోల్, xDrive 20d డీజిల్ వేరియంట్‌లకు ఇది కొత్తగా జత అయింది. ఈ కారులో 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉండి 258 హెచ్‌పీ శక్తి, 400 ఎన్‌ఎం టార్క్ ఇస్తుంది. కేవలం 6.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం దీనికి ఉంది.

వివరాలు 

ఫీచర్లు

ఎనిమిది స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు xDrive ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా వస్తుంది. మెరుగైన పనితీరు,మైలేజ్ కోసం 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందించారు. ఎలక్ట్రానిక్‌గా నియంత్రిత డ్యాంపర్లతో అడాప్టివ్ సస్పెన్షన్, స్పోర్ట్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4,755 మిల్లీమీటర్ల పొడవు, 2,865 మిల్లీమీటర్ల వీల్‌బేస్‌తో ఈ ఎస్‌యూవీ ఆకట్టుకుంటుంది. లోపల 12.3 అంగుళాల ఇన్‌ఫో డిస్‌ప్లే, 14.9 అంగుళాల కంట్రోల్ డిస్‌ప్లేతో కూడిన కర్వ్డ్ డిస్‌ప్లే, హెడ్‌అప్ డిస్‌ప్లే, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ స్పోర్ట్స్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

వివరాలు 

ఫీచర్లు

తాజా BMW ఆపరేటింగ్ సిస్టమ్ 9పై నడిచే ఈ కారులో డ్రైవింగ్ అసిస్టెంట్ ప్లస్, పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. బ్రూక్లిన్ గ్రే, ఆల్పైన్ వైట్, టాంజనైట్ బ్లూ, బ్లాక్ సఫైర్ వంటి రంగుల్లో, ఎస్ప్రెస్సో బ్రౌన్, కాల్మ్ బీజే అప్హోల్స్టరీ ఆప్షన్‌లతో ఈ కొత్త X3 వినియోగదారులను ఆకర్షించనుంది.

Advertisement