Page Loader
బైక్ నడిపేవారి భద్రత కోసం BMW తీసుకొచ్చిన HUD టెక్నాలజీ గ్లాసెస్ విశేషాలు 
BMW Motorrad తయారు చేసిన HUD గ్లాసెస్

బైక్ నడిపేవారి భద్రత కోసం BMW తీసుకొచ్చిన HUD టెక్నాలజీ గ్లాసెస్ విశేషాలు 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 10, 2023
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్ నడిపేవారు HUD(హెడ్ అప్ డిస్ ప్లే) టెక్నాలజీ గ్లాసెస్ ని వాడతారని అందరికీ తెలుసు. ప్రస్తుతం బైక్ నడిపే వారికోసం కూడా ఇలాంటి గ్లాసెస్ ని BMW మోటరాడ్ తయారు చేసింది. ఈ గ్లాసెస్ ని స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. UVA/UVB లెన్సెస్ ని కలిగి ఉన్న రెండు గ్లాస్ సెట్లు వస్తాయి. అందులో ఒకటి సన్ గ్లాస్ లాగా ఉంటుంది. మరోటి 85 శాతం ట్రాన్స్ పరేంట్ గా ఉంటుంది. ఈ గాగుల్స్ ని ఛార్జ్ చేయడానికి USB పోర్ట్ ఉంటుంది. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10గంటల వరకు వాడుకోవచ్చు. 10డిగ్రీల సెల్సియస్ నుండి 50డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వీటిని వాడవచ్చు.

Details

ఈ గ్లాసెస్ ని స్మార్ట్ ఫోన్ కి ఎలా కనెక్ట్ చేయాలి? 

HUD టెక్నాలజీ అంటే: దీనివల్ల గ్లాసెస్ మీద రోడ్డు మీద కనిపించే వ్యూ పాయింట్స్, స్పీడ్, ఇండికేటర్ యారోస్, నేవిగేషన్, వార్నింగ్ సిగ్నల్స్ అన్నీ కనిపిస్తాయి. అంటే బైక్ నడీపేవారు ఎటు చూసినా పైన చెప్పినవన్నీ కనిపిస్తాయి. కాబట్టి డిస్టబెన్స్ ఉండదు. BMW Motorrad Connectedయాప్ ద్వారా బ్లూటూత్ సాయంతో మొబైల్ కి కనెక్ట్ చేయవచ్చు. బైక్ నడుస్తున్నప్పుడు జీపీఎస్ డేటా మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుంది. స్పీడ్, స్పీడ్ లిమిట్, వీధుల పేర్లు, ఎటు వెళ్ళాలో తెలియజేసే డైరెక్షన్స్ అన్నీ కుడివైపు గ్లాసు పై భాగంలో కనిపిస్తాయి. ఇండియాలో ఈ ప్రోడక్ట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. యూరప్ లో 690పౌండ్లు(62,426రూపాయలు)గా ఉంది.