BMW X5: కొత్త BMW X5 వచ్చేసింది.. 845 కి.మీ రేంజ్‌తో ఎలక్ట్రిక్ వెర్షన్
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ తన ఐదో తరం BMW X5ను అధికారికంగా ఆవిష్కరించింది. డిజైన్, టెక్నాలజీ, పనితీరు, పవర్‌ట్రెయిన్‌లలో భారీ మార్పులతో ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. పెట్రోల్,డీజిల్,ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV), పూర్తిగా ఎలక్ట్రిక్,హైడ్రోజన్ వంటి ఐదు రకాల పవర్‌ట్రెయిన్‌లతో ఈ SUV అందుబాటులోకి రానుంది. దీంతో తన విభాగంలోనే అత్యధిక ఎంపికలను అందించే వాహనంగా ఇది నిలవనుంది. ఈ కొత్త X5 ఉత్పత్తి 2026 ఆగస్టు నుంచి అమెరికాలోని స్పార్టన్‌బర్గ్ ప్లాంట్‌లో ప్రారంభం కానుంది.
వివరాలు
ఆధునిక, ఆకర్షణీయమైన డిజైన్
కొత్త BMW X5 మరింత ఆధునిక, ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందింది. ముందుభాగంలో డబుల్ 'X' ఆకారంలోని LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, నిలువుగా ఉన్న ప్రకాశించే కిడ్నీ గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాధారణ డోర్ హ్యాండిల్స్‌కు బదులుగా విద్యుత్ ఆధారిత డోర్ ఓపెనింగ్ వ్యవస్థను అందించారు. వాహనం పక్క భాగంలో భారీ వీల్ ఆర్చ్‌లు, బలమైన షోల్డర్ లైన్, స్వల్పంగా వెనుకకు వాలే రూఫ్ డిజైన్ కొనసాగించారు. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త బంపర్, లేయర్డ్ రూఫ్ స్పాయిలర్‌తో మరింత ప్రీమియం రూపాన్ని సొంతం చేసుకుంది.
వివరాలు
వెనుక సీట్లను మడిచినప్పుడు.. 1,850 లీటర్ల బూట్ స్పేస్
ఈ SUVకు మొత్తం 11 బాహ్య రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 21 అంగుళాల నుంచి 23 అంగుళాల వరకు వీల్ ఆప్షన్లు ఉన్నాయి. వాహనం పొడవు 4,994 మిల్లీమీటర్లు కాగా, వీల్‌బేస్ 3,035 మిల్లీమీటర్లు ఉంది. వెనుక సీట్లను మడిచినప్పుడు గరిష్టంగా 1,850 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. క్యాబిన్‌లో కూడా BMW భారీ మార్పులు చేసింది. 17.9 అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్‌తో పాటు, విండ్‌షీల్డ్ దిగువ భాగంలో సమాచారాన్ని చూపించే కొత్త Panoramic Vision డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. దీనికి తోడు 3D హెడ్-అప్ డిస్‌ప్లే, తాజా Panoramic iDrive ఇంటర్‌ఫేస్‌ను అందించారు.
వివరాలు
కొత్త BMW X5లో మొత్తం ఐదు రకాల పవర్‌ట్రెయిన్ ఎంపికలు
అదనంగా 14.6 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే,3D ఎఫెక్ట్‌లతో కూడిన అంబియెంట్ లైటింగ్,స్లేట్,గ్లాస్ వంటి ప్రీమియం మెటీరియల్స్‌తో ఇంటీరియర్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పనోరమిక్ సన్‌రూఫ్,వెంటిలేటెడ్,మసాజ్ సీట్లు,స్పోర్ట్స్ సీట్లు,ఆటోమేటిక్ డోర్లు వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కొత్త BMW X5లో మొత్తం ఐదు రకాల పవర్‌ట్రెయిన్ ఎంపికలు ఉన్నాయి. ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ వేరియంట్లు మార్కెట్‌లోకి వస్తాయి. అనంతరం హైబ్రిడ్,ఎలక్ట్రిక్, హైడ్రోజన్ మోడళ్లు విడుదల కానున్నాయి. పెట్రోల్ వేరియంట్ X5 40 xDriveలో 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో పాటు 48V మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను అమర్చారు. ఇది 400 హార్స్‌పవర్, 580 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ X5 40d xDrive 313 హార్స్‌పవర్, 670 Nm టార్క్‌ను అందిస్తుంది.
వివరాలు
ఎలక్ట్రిక్ మోడ్‌లో గరిష్టంగా 102 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు.
ప్లగ్-ఇన్ హైబ్రిడ్ శ్రేణిలో X5 50e xDrive, X5 M60e xDrive మోడళ్లు ఉన్నాయి. ఇవి వరుసగా 489 హార్స్‌పవర్, 612 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు మోడళ్లు పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో గరిష్టంగా 102 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. పూర్తిగా ఎలక్ట్రిక్ X5లో 141 kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి కలిపి 578 హార్స్‌పవర్, 805 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే WLTP ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 845 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 23 నిమిషాల్లోనే ఛార్జ్ చేయవచ్చు.
వివరాలు
కొత్త BMW X5లో అన్ని వేరియంట్లకు అడాప్టివ్ సస్పెన్షన్
ఇక iX5 Hydrogen పేరుతో హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే మోడల్‌ను కూడా BMW తరువాతి దశలో విడుదల చేయనుంది. టయోటాతో కలిసి అభివృద్ధి చేసిన ఈ మోడల్‌లో ఫ్యూయల్ సెల్ వ్యవస్థతో పాటు చిన్న బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. కొత్త BMW X5లో అన్ని వేరియంట్లకు అడాప్టివ్ సస్పెన్షన్‌ను ప్రామాణికంగా అందిస్తున్నారు. టాప్ వేరియంట్లలో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్‌తో పాటు ఆధునిక ఛాసిస్ కంట్రోల్ వ్యవస్థలు కూడా ఉంటాయి. దీంతో వివిధ రహదారి పరిస్థితుల్లో మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవంతో పాటు మెరుగైన హ్యాండ్లింగ్‌ను అందించనుంది.