Loading...
BMW F 450 R: BMW F 450 R వచ్చేస్తోందా? కొత్త బైక్‌పై కంపెనీ టీజర్ విడుదల
BMW F 450 R వచ్చేస్తోందా? కొత్త బైక్‌పై కంపెనీ టీజర్ విడుదల

BMW F 450 R: BMW F 450 R వచ్చేస్తోందా? కొత్త బైక్‌పై కంపెనీ టీజర్ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BMW Motorrad కొత్త మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 1, 2026న కొత్త బైక్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది. అయితే, ఈ కొత్త మోడల్ ఏది అనే విషయాన్ని మాత్రం BMW ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఇది F 450 R రోడ్‌స్టర్ కావచ్చనే అంచనాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో F 450 GS అడ్వెంచర్ టూరర్‌ను పరిచయం చేసిన BMW.. అదే 450సీసీ ప్లాట్‌ఫామ్‌పై కొత్త నేకెడ్ రోడ్‌స్టర్‌ను తీసుకురావచ్చని భావిస్తున్నారు. F 450 R వస్తే.. F 450 GSకు స్పోర్టీ, రోడ్ ఫోకస్డ్ వెర్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.

వివరాలు 

F 450 GS ఆధారంగానే..

BMW F 450 GS ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. సబ్-500సీసీ విభాగంలో కంపెనీకి ఇది కొత్త ఎంట్రీ లెవల్ ప్లాట్‌ఫామ్‌గా మారింది.

గతంలో ఉన్న G 310 R,G 310 GS మోడళ్ల స్థానాన్ని ఇది భర్తీ చేసింది.

F 450 GSలో 420సీసీ లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను ఉపయోగించారు.

ఈ ఇంజిన్ 48హెచ్‌పీ పవర్,43 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

టాప్-స్పెక్ GS ట్రోఫీ వేరియంట్‌లో BMW సెగ్మెంట్‌లో తొలిసారిగా Easy Ride Clutch (ERC) సాంకేతికతను అందించింది.

178 కిలోల కర్బ్ వెయిట్‌తో ఉన్న F 450 GS మిడ్-కెపాసిటీ అడ్వెంచర్ బైక్ విభాగంలో మంచి దృష్టిని ఆకర్షించింది.

వివరాలు 

F 450 GS ఆధారంగానే..

కొత్త రోడ్‌స్టర్ కూడా ఇదే ఇంజిన్, ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడితే.. ఇందులోని చాలా భాగాలు F 450 GS నుంచి తీసుకునే అవకాశం ఉంది.

అయితే నగరాల్లో, హైవేలపై స్పోర్టీ రైడింగ్‌కు అనుగుణంగా ఇంజిన్ ట్యూనింగ్, రైడింగ్ పొజిషన్‌లో మార్పులు ఉండొచ్చు.

సస్పెన్షన్ విషయంలోనూ తేడాలు కనిపించే అవకాశం ఉంది. F 450 GSలో 43ఎంఎం USD ఫోర్క్, 180ఎంఎం ట్రావెల్‌తో పాటు వెనుక భాగంలో లాంగ్ ట్రావెల్ మోనోషాక్ ఉంది.

రోడ్‌స్టర్ మోడల్‌లో సస్పెన్షన్ ట్రావెల్‌ను తగ్గించి, డ్యాంపింగ్‌ను మార్చే అవకాశం ఉంది.

దీనివల్ల ఆఫ్‌రోడ్ సామర్థ్యం కంటే రోడ్లపై చురుకుదనం, రైడింగ్ సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

ఫీచర్లు ఎలా ఉంటాయి?

ప్రస్తుతం విడుదల చేసిన టీజర్‌లో కొత్త బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కనిపించలేదు.

అయితే ఇందులో USD ఫోర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంట్రీ లెవల్ విభాగంలోనూ ప్రీమియం ఫీచర్లను అందించాలనే BMW విధానానికి ఇది అనుగుణంగా ఉంది.

సస్పెన్షన్ పూర్తిగా అడ్జస్టబుల్‌గా ఉంటుందా? లేక ధరను నియంత్రించేందుకు సాధారణ సెటప్‌ను ఉపయోగిస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ధర కీలకం..

భారత్‌లో ఈ బైక్‌ ధర కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో Aprilia Tuono 457 Special Edition ధర సుమారు రూ.3.99 లక్షలుగా ఉంది.

KTM 390 Duke R ధర సుమారు రూ.3.45 లక్షలుగా ఉంది. BMW కొత్త F 450 Rను పోటీ ధరతో తీసుకొస్తే.. సుమారు రూ.4 లక్షల దగ్గర ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అయితే BMW బ్రాండ్ ప్రీమియం, అందించే ఫీచర్లను బట్టి ధర మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

వివరాలు 

భారత్‌లోకి వస్తుందా?

భారత మార్కెట్లోకి F 450 R వస్తే..పెరుగుతున్న 400-500సీసీ నేకెడ్ బైక్ విభాగంలో BMWకి మరో కీలక మోడల్ అవుతుంది.

పనితీరు,టెక్నాలజీతో పాటు రోజువారీ వినియోగానికి సరిపోయే బైక్‌ల కోసం చూస్తున్న వారికి ఇది పోటీగా నిలవొచ్చు.

ట్విన్-సిలిండర్ ఇంజిన్ కారణంగా KTM 390 Duke వంటి సింగిల్-సిలిండర్ బైక్‌లతో పోలిస్తే F 450 R మరింత స్మూత్,రిఫైన్డ్ రైడింగ్ అనుభూతిని అందించే అవకాశం ఉంది.

అదే సమయంలో పెద్దఇంజిన్ కలిగిన ఖరీదైన మిడ్-వెయిట్ నేకెడ్ బైక్‌ల కంటే అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది.

అయితే BMW అధికారికంగా మోడల్ పేరు,స్పెసిఫికేషన్లు,ధర వంటి వివరాలను వెల్లడించే వరకు F 450 R అనే పేరు,ఫీచర్లపై వస్తున్న సమాచారం అంచనాలుగానే చూడాలి.

ADVERTISEMENT