Page Loader
2030నాటికి 10కొత్త కార్ల విడుదలకు మారుతీ సుజుకి ప్లాన్ 
2030నాటికి 10కొత్త కార్ల విడుదలకు మారుతీ సుజుకి ప్లాన్

2030నాటికి 10కొత్త కార్ల విడుదలకు మారుతీ సుజుకి ప్లాన్ 

వ్రాసిన వారు Stalin
Aug 06, 2023
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ దిగ్గజ ఆటోమేకర్ మారుతి సుజుకీ కొత్త మోడళ్లపై ఫోకస్ పెట్టింది. కార్ల మార్కెట్‌లో తన మార్కెట్‌ను పెంచుకునేందుక, ఇతర కంపెనీలకు పోటీగా 10కొత్త కార్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. 2030 నాటికి ఈ పది మోడళ్లను మారుతి సుజుకీ మార్కెట్లోకి విడుదల చేయాలని చూస్తోంది. అయితే ఈ కొత్త మోడల్స్‌లో 6ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండనున్నట్లు పీటీఐ వార్త ఏజెన్సీ పేర్కొంది. 2032 నాటికి మొత్తం అమ్మకాలను సంవత్సరానికి 4 మిలియన్ యూనిట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా మారుతి ఆటో మేకర్ పెట్టుకుంది. ప్రస్తుత 18మోడళ్ల నుంచి 2031 ఆర్థిక సంవత్సరం నాటికి 28 మోడళ్లను తమ పోర్ట్‌ఫోలియోలో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ తెలిపారు.

కారు

మా మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటాం: మారుతి సుజుకీ

మారుతీ సుజుకీ కంపెనీ గత కొన్నేళ్లుగా ఈవీ విభాగంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఆదరణను పొందుతోంది. దీంతో మారుతి సుజుకి ఇప్పుడు 3.0 స్ట్రాటజీ కింద ఎస్‌యూవీ, క్రాస్‌ఓవర్‌లపై ఎక్కువ దృష్టి పెడుతుందని పీటీఐ నివేదిక చెబుతోంది. మరోవైపు మారుతి సుజుకీ చిన్న కార్ల విక్రయాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అందుకే మారుతి సుజుకి తన ఉత్పత్తి వ్యూహాన్ని బలపరుస్తోంది. మార్కెట్లో మారుతి సుజుకి కంపెనీకి చెందిన నాలుగు ఎస్‌యూవీ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ విభాగంలో అగ్రగామిగా దూసుకుపోతున్నామని కంపెనీ తెలిపింది. తాము తమ మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటూ పాతామని ఆశాభావం వ్యక్తం చేసింది.

కారు

2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి 6 శాతం వృద్ధి రేటు

2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి 6 శాతం వృద్ధి రేటును కొనసాగించాలని కంపెనీ భావిస్తున్నట్లు మారుతి సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. భవిష్యత్ డిమాండ్‌ను తీర్చేందుకు కంపెనీ తీసుకుంటున్న చర్యలను ఆయన హైలైట్ చేశారు. ప్రస్తుతం భారత కారు మార్కెట్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ మార్కెట్‌గా అవతరించిందని భార్గవ అన్నారు. సుజుకి మోటార్ కార్పొరేషన్‌కు చెందిన గుజరాత్ ప్లాంట్‌ను పూర్తిగా కొనుగోలు చేయనున్నట్లు మారుతీ సుజుకీ కొద్ది రోజుల క్రితం వెల్లడించింది. ఉత్పత్తి వాల్యూమ్‌లను పెంచే వ్యూహంలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని భార్గవ అన్నారు.