Loading...
Jeep Wrangler JL-2A: పాత డిజైన్‌.. కొత్త ఫీచర్లు.. జీప్‌ JL-2A స్పెషల్ ఎడిషన్‌ వచ్చేసింది!
పాత డిజైన్‌.. కొత్త ఫీచర్లు.. జీప్‌ JL-2A స్పెషల్ ఎడిషన్‌ వచ్చేసింది!

Jeep Wrangler JL-2A: పాత డిజైన్‌.. కొత్త ఫీచర్లు.. జీప్‌ JL-2A స్పెషల్ ఎడిషన్‌ వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీప్‌ తన కొత్త రాంగ్లర్ స్పెషల్ ఎడిషన్‌ 'JL-2A' కోసం అమెరికాలో ఆర్డర్లను ప్రారంభించింది. జీప్‌ బ్రాండ్‌కు చెందిన తొలి సివిలియన్ వాహనం విల్లీస్ CJ-2Aకు నివాళిగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించారు. రాంగ్లర్ రూబికాన్‌ ఆధారంగా రూపొందించిన JL-2Aలో ఆధునిక ఫీచర్లతో పాటు క్లాసిక్ డిజైన్‌ అంశాలను జోడించారు.

వివరాలు

క్లాసిక్ డిజైన్‌తో మోడ్రన్ ఫీచర్లు

2027 జీప్ రాంగ్లర్ JL-2A.. ఒరిజినల్ CJ-2Aలోని ఐకానిక్ డిజైన్‌ అంశాలను ఆధునిక సౌకర్యాలతో కలిపి రూపొందించారు.

తొలి తరం CJ-2A మోడళ్లను వార్మ్ ట్యాన్, ఆలివ్ గ్రీన్ రంగుల్లో అందించేవారు. అలాగే జీప్‌కు ప్రత్యేక గుర్తింపుగా మారిన సెవెన్-స్లాట్ గ్రిల్‌ కూడా అప్పటి వాహనాల్లో ఉండేది.

కొత్త JL-2Aలోనూ ఈ డిజైన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. రెండు డోర్ల వేరియంట్‌ను జీప్‌ ప్రస్తుత ట్యాన్‌ షేడ్ అయిన గోబి (Gobi) రంగులో, నాలుగు డోర్ల వేరియంట్‌ను '41 పేరుతో పిలిచే ఆలివ్ గ్రీన్‌ షేడ్‌లో అందిస్తున్నారు.

వివరాలు

కస్టమైజేషన్‌ ఆప్షన్లు

JL-2Aలో 17-అంగుళాల రెట్రో-స్టైల్ వీల్స్‌ను అందించారు. వీటికి స్టాండర్డ్‌గా 33-అంగుళాల BFGoodrich KO2 ఆల్-టెర్రైన్ టైర్లు అమర్చారు.

వీల్స్‌కు ఉపయోగించిన బ్రైట్ ఆరెంజ్ రంగు.. ఒరిజినల్ CJ-2Aలో కనిపించిన సన్‌సెట్ రెడ్ వీల్స్‌ను గుర్తు చేస్తుంది.

మరింత ఆధునిక లుక్‌ కోరుకునే కస్టమర్ల కోసం జీప్‌ ఈ మోడల్‌లో పలు రంగుల ఆప్షన్లను కూడా అందిస్తోంది. బ్రైట్ వైట్, స్టింగ్ గ్రే, ఘోస్ట్, జూస్ రంగుల్లో JL-2Aను ఎంచుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

ఇంటీరియర్‌లోనూ ప్రత్యేకత

JL-2A ఇంటీరియర్‌లో ఆరెంజ్ స్టిచింగ్‌తో పాటు స్పెషల్ ఎడిషన్‌ వివరాలను జోడించారు. ఇందులో నప్పా హెరిటేజ్ ట్యాన్, బైసన్ బ్రౌన్ ఫినిష్‌ను అందించారు.

ఇవి ఒరిజినల్ CJ-2Aలో కనిపించిన క్లాసిక్ ట్యాన్ సీట్లకు ఆధునిక రూపాన్ని ఇస్తాయి. ఎయిర్ వెంట్స్‌పై సెవెన్-స్లాట్ గ్రిల్ ఐకాన్‌తో పాటు విల్లీస్ సిల్హౌట్‌ను కూడా ఇచ్చారు.

గేర్‌ షిఫ్టర్‌పై విల్లీస్-ఓవర్‌ల్యాండ్ మెడాలియన్ను‌ అమర్చారు.

ADVERTISEMENT

వివరాలు

రెండు ఇంజిన్ ఆప్షన్లు

రాంగ్లర్ రూబికాన్ ఆధారంగా రూపొందించిన JL-2Aలో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇందులో 285 హెచ్‌పీ సామర్థ్యంతో 3.6-లీటర్ V6 ఇంజిన్, మరోవైపు 270 హెచ్‌పీ సామర్థ్యంతో 2.0-లీటర్ టర్బో-ఫోర్ ఇంజిన్ అందుబాటులో ఉన్నాయి.

ఈ రెండు ఇంజిన్లను 6-స్పీడ్ మాన్యువల్ లేదా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేసుకోవచ్చు.

రూబికాన్ వేరియంట్‌లో ఉండే సామర్థ్యాలను కొనసాగిస్తూ JL-2Aలో ఎలక్ట్రానిక్ లాకింగ్ ఫ్రంట్, రియర్ డిఫరెన్షియల్స్‌తో పాటు డిస్‌కనెక్ట్ అయ్యే యాంటీ-రోల్ బార్ వంటి అధునాతన ఫీచర్లను కూడా అందించారు.

వివరాలు

ధర ఎంతంటే?

అమెరికా మార్కెట్‌లో జీప్ రాంగ్లర్ JL-2A ప్యాకేజీ ధరను 4,995 డాలర్లుగా నిర్ణయించింది.

ఇదే తరహాలో ఫీచర్లు ఉన్న రూబికాన్ మోడల్‌ కంటే JL-2A ధర కేవలం 115 డాలర్లు మాత్రమే ఎక్కువగా ఉండటం విశేషం.

క్లాసిక్ విల్లీస్ CJ-2A డిజైన్‌ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ఆధునిక ఫీచర్లు, ఆఫ్‌-రోడ్ సామర్థ్యాలను కలిపిన ప్రత్యేక ఎడిషన్‌గా JL-2Aను జీప్‌ తీసుకొచ్చింది.

ADVERTISEMENT