Page Loader
ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా
రూ.70,000 వరకు తగ్గింపు ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి

ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 08, 2023
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశీ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఈ ఫిబ్రవరిలో భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై తగ్గింపుతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. తగ్గింపు ఉన్న కార్లలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 ఉన్నాయి. రూ.70,000 వరకు ఆఫర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా సంస్థ అనేక రకాల మోడల్‌లతో ప్రపంచవ్యాప్తంగా SUV స్పెషలిస్ట్‌గా పేరుగాంచింది. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ఇతర వాహన తయారీదారులు ధరలను పెంచుతున్న సమయంలో, ఈ స్వదేశీ బ్రాండ్ తన కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. మహీంద్రా XUV300: ప్రారంభ ధర రూ. 8.41 లక్షలు ఉంటుంది.దీనిపై రూ.36,500 వరకు తగ్గింపు ఉంది. దీనికి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 1.5-లీటర్ టర్బో-డీజిల్ మిల్లు సపోర్ట్ ఉంది.

కార్

XUV400 EV, స్కార్పియో క్లాసిక్ సహ మరికొన్ని కార్లపై ఎటువంటి తగ్గింపులు లేవు

మహీంద్రా బొలెరో నియో: ప్రారంభ ధర రూ. 9.48 లక్షలు. ఇప్పుడు రూ. 59,000 విలువైన ప్రయోజనాలతో కొనుగోలుకు సిద్దంగా ఉంది. ఈ SUV 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ తో నడుస్తుంది. మహీంద్రా బొలెరో: ధర ప్రారంభ ధర రూ. 9.53 లక్షలు. ఇది రూ.70,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ కారు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో నడుస్తుంది. మహీంద్రా మరాజో: ప్రారంభ ధర రూ. 13.71 లక్షలు. ఈ ఫిబ్రవరిలో దీనిపై రూ. రూ. 37,000 తగ్గింపు ఉంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ తో నడుస్తుంది. ఈ నెలలో XUV400 EV, స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-N, Thar, XUV700పై ఎలాంటి ప్రయోజనాలు లేవు.