భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్
భారతదేశానికి చెందిన SUV స్పెషలిస్ట్ మహీంద్రా XUV400 కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో XUV400ను బుక్ చేసుకోవచ్చు. ఇవి మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. మహీంద్రాకు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV టాటా మోటార్స్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్వదేశీ ఎలక్ట్రిక్ తయారీదారుగా ప్రస్తుతం కొనసాగుతుంది. మహీంద్రా కూడా e2o Plus, eVeritoతో భారతదేశంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించింది. ఈ XUV400 గురించి మొట్టమొదటగా గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రకటించారు. బేస్ EC మోడల్ ధర రూ.15.99 లక్షలు, రేంజ్-టాపింగ్ EL ధర రూ. 18.99 లక్షలు. దీనిని ఆన్‌లైన్‌లో లేదా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
సమర్ధవంతమైన ఆల్ రౌండర్ కావాలనుకుంటే XUV400ని ఎంచుకోవాలి
ఇది ఒక సాధారణ SUV లాగే మస్కులర్ హుడ్, కాపర్-ఫినిష్డ్ ఇన్‌సర్ట్‌లతో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, స్వెప్ట్-బ్యాక్ ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్లతో వస్తుంది. 34.5kWh లేదా 39.4kWh బ్యాటరీ ప్యాక్‌తో కనెక్టయిన ఫ్రంట్-యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడుస్తుంది. ఇది చిన్న బ్యాటరీ ప్యాక్‌పై 375కిమీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ పై 456కిమీల వరకు నడుస్తుంది. ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక కెమెరా ఉన్నాయి. మహీంద్రా XUV400 Tata Nexon EV PRIME, Nexon EV MAXతో పోల్చితే సామర్ధ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్‌లు, విశాలమైన టెక్-ఫార్వర్డ్ క్యాబిన్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును అందిస్తుంది. ప్రస్తుతం EV విభాగంలో సమర్ధవంతమైన ఆల్ రౌండర్ కావాలనుకుంటే XUV400ని ఎంచుకోవాలి. .