XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో లాంచ్ చేసిన మహీంద్రా
మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహానాన్ని భారతదేశంలో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. సరికొత్త కార్ టెక్నాలజీతో విశాలమైన క్యాబిన్ తో వస్తుంది. మహీంద్రా XUV400 గురించి గత సంవత్సరం సెప్టెంబరులో ప్రకటించారు. ఈ బ్రాండ్ కు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV. మార్కెట్‌లో, MG ZS EV, టాటా నెక్సాన్ EV వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతుంది. మహీంద్రా XUV400లో ఒక మస్క్యులర్ హుడ్, ట్విన్ పీక్స్ లోగో, ఎయిర్ వెంట్, LED DRLలతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఒక స్పాయిలర్ తో పాటు LED టెయిల్‌లైట్‌లు వెనుక వైపు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది ఆర్కిటిక్ బ్లూ, నాపోలి బ్లాక్, ఎవరెస్ట్ వైట్ సహా ఆరు రంగులలో అందుబాటులో ఉంది.
ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి
ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. మహీంద్రా XUV400 34.5kWh బ్యాటరీతో ఛార్జ్‌కి 375కిమీల వరకు, 39.4kWh ఛార్జ్ కి 456 కిమీల వరకు నడుస్తుంది. ఇది గరిష్టంగా 150కిమీ/గం వేగంతో వెళ్తుంది. ఇందులో ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. మహీంద్రా XUV400 ప్రారంభ ధర EC మోడల్ కు రూ.15.99 లక్షలు, EL వేరియంట్ కు రూ.18.99 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). ఈ ప్రారంభ ధరలు ప్రతి వేరియంట్ మొదటి 5,000 యూనిట్లకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. బుకింగ్‌లు జనవరి 26న ప్రారంభమయితే డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి.