Ducati: డుకాటీ మాన్‌స్టర్ డార్క్ బైక్ ఆవిష్కరణ.. ఆల్ బ్లాక్ డిజైన్‌తో కొత్త లుక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటీ (Ducati) తన మాన్‌స్టర్ సిరీస్‌లో కొత్త బైక్‌ను ఆవిష్కరించింది. దీనికి 'మాన్‌స్టర్ డార్క్' (Monster Dark) అని పేరు పెట్టింది. పూర్తిగా నలుపు రంగు డిజైన్‌తో ఈ బైక్‌ను తీసుకొచ్చింది. అయితే, డిజైన్‌లో మార్పులు చేసినప్పటికీ ఇంజిన్ సామర్థ్యంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. గత మోడల్‌లో ఉన్న 890 సీసీ వీ2 ఇంజిన్‌నే ఇందులోనూ కొనసాగించింది. ఈ ఇంజిన్ 9,000 ఆర్‌పీఎం వద్ద గరిష్ఠంగా 111 హెచ్‌పీ పవర్‌ను, 7,250 ఆర్‌పీఎం వద్ద 91.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తంగా చూస్తే.. పనితీరు కంటే బైక్ రూపురేఖలపైనే కంపెనీ ఎక్కువగా దృష్టి పెట్టింది.
వివరాలు
మాన్‌స్టర్ డార్క్ డిజైన్ ఎలా ఉందంటే?
కొత్త మాన్‌స్టర్ డార్క్ బైక్‌కు 'డార్క్ స్టీల్త్' బ్లాక్ కలర్ థీమ్‌ను ఇచ్చారు.
వీల్స్‌తో పాటు ముందు ఫ్రేమ్, స్నార్కెల్ క్యాప్, సైలెన్సర్ వంటి కొన్ని భాగాలకు కూడా నలుపు రంగును ఉపయోగించారు.
ఈ బైక్‌లో గత మోడళ్లకు ప్రత్యేక గుర్తింపుగా ఉన్న 'బైసన్ బ్యాక్' ఆకారంలోని ఫ్యూయల్ ట్యాంక్‌ను కొనసాగించారు.
ఇందులోని ఎయిర్ వెంట్స్ రెండో తరం మాన్‌స్టర్ బైక్‌ను గుర్తు చేస్తాయి. ముందు భాగంలో పూర్తిగా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
ఇందులో డేటైమ్ రన్నింగ్ లైట్ (డీఆర్‌ఎల్) కూడా ఉంది. ఇండికేటర్లను సైతం ఎల్ఈడీతో రూపొందించారు.
వివరాలు
లీటరుకు దాదాపు 19.2 కిలోమీటర్ల మైలేజీ
ఈ బైక్‌లో 890 సీసీ లిక్విడ్ కూల్డ్ వీ2 ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు.ఇందులో ఇంటేక్ వేరియబుల్ టైమింగ్ టెక్నాలజీ ఉంది.
ఇది ఇంజిన్ పనితీరుకు అనుగుణంగా గాలి లోపలికి వెళ్లే వాల్వ్ తెరుచుకునే సమయాన్ని నిరంతరం సర్దుబాటు చేస్తుంది.
ఈ ఇంజిన్‌కు ఆరు గేర్ల గేర్‌బాక్స్‌ను జత చేశారు.స్లిప్పర్ క్లచ్ సౌకర్యం కూడా ఉంది.
యూరో 5+ పరీక్షల్లో ఈ బైక్ 100 కిలోమీటర్లకు 5.2 లీటర్ల ఇంధనాన్ని వినియోగించింది.
అంటే లీటరుకు సుమారు 19.2కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
ఇందులో 14లీటర్ల సామర్థ్యం ఉన్న ఫ్యూయల్ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు.
ఈ లెక్కన ఒక్కసారి ట్యాంక్ నింపితే సుమారు 270కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
అయితే,వాస్తవ పరిస్థితుల్లో మైలేజీ, ప్రయాణ దూరం మారే అవకాశం ఉంది.
వివరాలు
షోవా సస్పెన్షన్ సెటప్‌తో కొత్త బైక్
డుకాటీ మాన్‌స్టర్ డార్క్ బైక్ బరువు (ఇంధనం లేకుండా) 175 కిలోలు. ఇందులో అల్యూమినియం మోనోకాక్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు.
సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 43 ఎంఎం షోవా అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌ను ఏర్పాటు చేశారు.
వెనుకవైపు ప్రీలోడ్‌ను సర్దుబాటు చేసుకునే సదుపాయంతో షోవా మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు.
ముందు చక్రానికి 320 ఎంఎం పరిమాణంలో రెండు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.
వీటికి బ్రెంబో మోనోబ్లాక్ M4.32 కాలిపర్లు, కార్నరింగ్ ఏబీఎస్‌ను జత చేశారు.
టైర్ల విషయానికి వస్తే.. ముందు భాగంలో 120/70 R17, వెనుక భాగంలో 180/55 R17 పరిమాణం కలిగిన పిరెల్లీ డయాబ్లో రోస్సో IV టైర్లను అమర్చారు.
వివరాలు
నాలుగు రైడింగ్ మోడ్‌లు.. ట్రాక్షన్ కంట్రోల్
ఈ బైక్‌లో 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది గత మోడల్‌లోని డిస్‌ప్లే కంటే 16 శాతం పెద్దది.
ఇందులో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ప్రతి మోడ్‌లోనూ పవర్ సెట్టింగ్‌ను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు.
వీటితో పాటు ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అదనంగా క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్, నావిగేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి సదుపాయాలను కూడా ఆప్షన్లుగా అందిస్తోంది.
ఈ మోడల్‌పై డుకాటీ రెండేళ్ల వారంటీ ఇస్తోంది. ఇందులో కిలోమీటర్ల పరిమితి లేదు.