Loading...
Ducati Monster: డుకాటీ మాన్‌స్టర్‌ V2 కొత్త అవతార్‌.. ధర రూ.13.99 లక్షలు, ఫీచర్లు అదుర్స్
డుకాటీ మాన్‌స్టర్‌ V2 కొత్త అవతార్‌.. ధర రూ.13.99 లక్షలు, ఫీచర్లు అదుర్స్

Ducati Monster: డుకాటీ మాన్‌స్టర్‌ V2 కొత్త అవతార్‌.. ధర రూ.13.99 లక్షలు, ఫీచర్లు అదుర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ప్రీమియం బైక్‌ తయారీ సంస్థ డుకాటీ (Ducati) భారత మార్కెట్లో నూతన 'మాన్‌స్టర్‌ V2, మాన్‌స్టర్+' మోడళ్లను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.13.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). మునుపటి మోడల్‌తో పోలిస్తే ధరలో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉన్నప్పటికీ.. కొత్త ఇంజిన్‌, తక్కువ బరువున్న ఛాసిస్‌, అప్‌డేటెడ్‌ డిజైన్‌, అధునాతన టెక్నాలజీతో ఈ బైక్‌ను పూర్తిగా రీ-ఇంజినీర్‌ చేసింది.

వివరాలు

890cc వీ-ట్విన్‌ ఇంజిన్

కొత్త మాన్‌స్టర్‌ V2లో ప్రధాన మార్పు ఇంజిన్‌. ఇందులో 890cc వీ-ట్విన్‌ ఇంజిన్‌ను అందించారు. ఇదే ఇంజిన్‌ను డుకాటీ మల్టీస్ట్రాడా V2, పనిగేల్‌ V2, స్ట్రీట్‌ఫైటర్‌ V2 మోడళ్లలోనూ ఉపయోగిస్తోంది.

గత మోడల్‌లోని 937cc ఇంజిన్‌తో పోలిస్తే సామర్థ్యం తగ్గినప్పటికీ.. పనితీరులో మాత్రం ఎలాంటి రాజీ లేదని కంపెనీ చెబుతోంది. కొత్త ఇంజిన్‌ 111 హెచ్‌పీ శక్తిని 9,000 ఆర్‌పీఎం వద్ద, 91.1 ఎన్ఎం టార్క్‌ను 7,250 ఆర్‌పీఎం వద్ద ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో ఇంటేక్‌ వేరియబుల్‌ టైమింగ్‌ (IVT) టెక్నాలజీ ఉంది. 4,000 నుంచి 9,000 ఆర్‌పీఎం మధ్య ఇంజిన్‌ గరిష్ఠ టార్క్‌లో 80 శాతం వరకు అందుబాటులో ఉంటుంది.

దీంతో వివిధ వేగాల్లోనూ బైక్‌ స్మూత్‌గా, వేగంగా స్పందించేలా రూపొందించారు.

వివరాలు

5 కిలోలు తగ్గిన బరువు

కొత్త మాన్‌స్టర్‌ V2లో బరువును కూడా గణనీయంగా తగ్గించారు. నూతన 'అల్యూమినియం మోనోకాక్‌ ఛాసిస్‌' కారణంగా మునుపటి మోడల్‌తో పోలిస్తే సుమారు 5 కిలోల బరువు తగ్గింది.

దీంతో బైక్‌ మరింత చురుగ్గా, సులభంగా హ్యాండిల్‌ చేసేలా మారింది. మాన్‌స్టర్‌ సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే మస్క్యులర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ను కొనసాగించారు.

స్టాండర్డ్‌ సీట్‌ హైట్‌ 815 మి.మీగా ఉంది. అదనపు యాక్సెసరీ సీట్లను ఎంచుకుంటే దీనిని 795 మి.మీ లేదా 775 మి.మీ వరకు తగ్గించుకోవచ్చు.

సస్పెన్షన్‌ కోసం ముందు భాగంలో 43 మి.మీ షోవా USD ఫోర్క్‌, వెనుక భాగంలో మోనోషాక్‌ను అందించారు. ఇవి రోజువారీ ప్రయాణాలతో పాటు స్పోర్టీ రైడింగ్‌కు అనుగుణంగా ట్యూన్‌ చేశారు.

ADVERTISEMENT

వివరాలు

రెండు వేరియంట్లలో..

డుకాటీ కొత్త మాన్‌స్టర్‌ను మాన్‌స్టర్‌ V2, మాన్‌స్టర్+ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. రెండు మోడళ్లలోనూ ఇంజిన్‌, మెకానికల్‌ అంశాలు ఒకేలా ఉంటాయి.

అయితే డిజైన్‌లో స్వల్ప తేడాలు ఉన్నాయి. మాన్‌స్టర్+లో హెడ్‌లైట్‌ కౌల్‌, పిలియన్‌ సీట్‌ కవర్‌ వంటి అదనపు డిజైన్‌ అంశాలు లభిస్తాయి.

ఇవి బైక్‌కు మరింత స్పోర్టీ, అగ్రెసివ్‌ లుక్‌ను ఇస్తాయి. ఈ బైక్‌ డుకాటీ రెడ్‌, ఐస్‌బర్గ్‌ వైట్‌, స్పోర్ట్‌ లివరీ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.

వేరియంట్‌, రంగును బట్టి ధర రూ.13.99 లక్షల నుంచి రూ.14.45 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) వరకు ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

ఫీచర్లకు కొదవలేదు

మాన్‌స్టర్‌ V2లో అధునాతన రైడర్‌ అసిస్టెన్స్‌ ఫీచర్లను అందించారు. ఇందులో రైడ్‌ మోడ్స్‌, పవర్‌ మోడ్స్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, వీలీ కంట్రోల్‌, ఇంజిన్‌ బ్రేక్‌ కంట్రోల్‌, కార్నరింగ్‌ ABS ఉన్నాయి.

ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌గా 5 అంగుళాల TFT డిస్‌ప్లేను ఇచ్చారు.

దీనికి అదనంగా ఫుల్‌ LED లైటింగ్‌, బై-డైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్‌, డైనమిక్‌ సెల్ఫ్‌ క్యాన్సలింగ్‌ ఇండికేటర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

వివరాలు

మెయింటెనెన్స్‌ విషయంలోనూ..

రోజువారీ వినియోగానికి మరింత అనుకూలంగా ఉండేలా మాన్‌స్టర్‌ V2 మెయింటెనెన్స్‌ ఇంటర్వల్స్‌ను కూడా పెంచారు.

వాల్వ్‌ క్లియరెన్స్‌ చెకింగ్‌ 45,000 కిలోమీటర్లకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. సాధారణ సర్వీసింగ్‌ను సంవత్సరానికి ఒకసారి లేదా 15,000 కిలోమీటర్లకు ఒకసారి చేయాలని డుకాటీ పేర్కొంది.

కొత్త మాన్‌స్టర్‌ V2పై రెండేళ్ల అన్‌లిమిటెడ్‌ కిలోమీటర్‌ వారంటీని కంపెనీ అందిస్తోంది. అదనంగా డుకాటీ ప్రొటెక్ట్‌ పీరియాడిక్‌ మెయింటెనెన్స్‌ కాంట్రాక్టులను కూడా అందుబాటులో ఉంచింది.

ADVERTISEMENT